November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

నేను నాన్ లోకల్ అయితే అప్పట్లో ముఖ్యమంత్రి గారికి తెలియదా..?

ఎన్టీఆర్ జిల్లా 
కొత్తూరు తాడేపల్లి

విజయవాడ రూరల్ మండలం, కొత్తూరు తాడేపల్లిలోని రచ్చబండ సమావేశంలో మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్.

నేను నాన్ లోకల్ అయితే అప్పట్లో ముఖ్యమంత్రి గారికి తెలియదా..?

అప్పట్లో ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను మైలవరం నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా 2019 ఎన్నికల ముందు ఎందుకు ఇక్కడ మైలవరంలో నియమించారు… ఇక్కడ ఎందుకు నిలబెట్టారు..?

నేను కరోనా సమయంలో ప్రజల కష్టనష్టాల్లో నా నియోజకవర్గ ప్రజల సంక్షేమ కోసం అండగా నిలబడ్డాను. అప్పుడు నేను నాన్ లోకల్ అనే విషయం మీకు తెలియదా?

నేను మూడున్నర లక్షల కిలోమీటర్లు మైలవరం నియోజకవర్గంలో పర్యటించిన కాలంలో మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా..?

ఇప్పుడు తాజాగా నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని, తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి గారిని కూడా వేరే చోటుకు తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారు.

మరి వీరందరూ నాన్ లోకల్ కాదా..?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరాలకు తగినట్లు మాట్లాడుతూ ఉంటారు.

సరే నన్ను ఇప్పుడు శ్రీమంతుడు అంటున్నారు.

ఇదే శ్రీమంతుడు పేదల కోసం ఆరేళ్ళు పనిచేశాడు.

కరోనా సమయంలో ఎంతోమంది చనిపోతే కనీసం వారి సొంత కుటుంబ సభ్యులు సైతం  దహన, ఖనన సంస్కారాలకు సైతం ముందుకు రాకపోతే ఈ శ్రీమంతుడే తన సొంత టీమ్ ని పెట్టి వారి దహన, ఖనన సంస్కారాలు చేయించాడు.

ఇప్పుడు ఇదే శ్రీమంతుడు నా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఏపీ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని, నా ప్రాంతానికి అభివృద్ధి కావాలనే లక్ష్యంతో, పేదలందరికీ అండగా ఉండాలనే ఆశయంతో టికెట్ ఇస్తానన్న కూడా వైసీపీ నుంచి పోటీ చేయకుండా ఎదురు తిరిగిన వ్యక్తి కూడా ఈ శ్రీమంతుడే.

పేదోడిపై పెత్తందారులను నాకు పోటీగా పెట్టిన ముఖ్యమంత్రి గారిని మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న విషయాలపై అతను ప్రశ్నించగలుగుతాడా…?

ఇదే విషయంపై ప్రజలందరూ ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది.
అని
మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్. అన్నారు

Also read

Related posts

Share via