శ్రీగిరి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజు సోమవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు నిర్వహించిన ప్రభోత్సవం నేత్రానంద భరితంగా సాగింది.ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ దేవిని మహా సరస్వతి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నందివాహనంపై కొలువు తీర్చారు. చతుర్భుజాలు కలిగి ఉండి వీణ ,అక్షమాల, పుస్తకాన్ని ధరించిన ఈ దేవిని దర్శించడం వలన విద్యా ప్రాప్తితో పాటు అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. నంది వాహనాధీశులైన శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించడం వలన పనుల్లో విజయం, బోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.వేలాదిమంది భక్తుల నీరాజనాల నడుమ ప్రభోత్సవాన్ని నిర్వహించారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..