ఇటీవల తెదేపాలో చేరిన అన్నదమ్ములపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఆదివారం జరిగింది.
కేసరపల్లి: ఇటీవల తెదేపాలో చేరిన అన్నదమ్ములపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఆదివారం జరిగింది. కేసరపల్లికి చెందిన సోదరులు బేతాళ ఈశ్వర్, రవి ఇటీవల వైకాపా నుంచి తెదేపాలో చేరి, రెండ్రోజులుగా గన్నవరం తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆదివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంపీటీసీ సభ్యుడు శొంఠి కిశోర్ తో సహా ప్రచారంలో పాల్గొనగా, పంచాయతీ వార్డు సభ్యురాలు మౌనిక భర్త నాగదేశి పవన్కల్యాణ్(పండు) ‘నన్ను తెదేపా వాట్సప్ గ్రూపులో ఎందుకు యాడ్ చేశావ్? పార్టీ ఎందుకు మారావ్ అంటూ ఈశ్వర్ను ప్రశ్నించారు. ఈశ్వర్ బదులిచ్చేందుకు యత్నిస్తుండగా.. పండుతో పాటు వచ్చిన వైకాపా కార్యకర్తలు బాపట్ల సురేష్, నాగదేశ కొండలరావు, పిల్లి సునీల్, బాపట్ల నవీన్, అంబటి రత్నంలు వాగ్వాదానికి దిగారు. ఈశ్వర్, రవిపై మూకుమ్మడిగా దాడిచేశారు. రాయితో రవి తలపై మోదారు. తీవ్రంగా గాయపడిన అన్నదమ్ములను స్థానికులు గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రవికి మూడు కుట్లు పడ్డాయి. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను తెదేపా నాయకులు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే రవి, ఈశ్వర్లపై వైకాపా శ్రేణులు దాడి చేశాయని ఆరోపించారు.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





