November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఫేక్ పట్టాలపై చర్యలకు ఉపక్రమించిన అధికారులు – VRO సస్పెండ్..

*కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కొనసాగుతున్న దొంగ పట్టాల పంపిణీ పరంపర..*

*ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా ఆగని దొంగ పట్టాల పంపిణీ*

*11వ డివిజన్ వీఆర్ఓపై సస్పెన్షన్ వేటు*

*ఎన్నికల కోడ్ ముందు పెద్ద ఎత్తున రోడ్ సైడ్ అక్రమణలకు దొంగ పట్టాలు ఇచ్చారని రెవెన్యూ అధికారులపై ఆరోపణలు..*

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కొనసాగుతున్న త్రీమెన్ కమిటీ విచారణ

విచారణ జరుగుతున్న సమయంలోనూ కొంత మంది వీఆర్ఓలు అధికార పార్టీ నేతలకు దాసోహులై ఫేక్ పట్టాలు ఇస్తున్న వైనం..

ఫలితంగా 11వ డివిజన్ వీఆర్ఓ శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు..

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ నెల 28న ఎటువంటి హద్దులు, సర్వే నెంబర్, సంతకం లేకుండా ఫేక్ పట్టా జారీ చేసిన వీఆర్ఓ శ్రీదేవి

దీనిపై వచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఆర్డీఓ ఎం వాణి..

ఉన్నతాధికారులకు తెలియకుండా సదరు వీఆర్ఓ వైసీపీ నేతల ద్వారా లబ్ధిదారునికి ఫేక్ పట్టా ఇచ్చారని ఆర్డీఓ విచారణలో తేటతెల్లం…

సంబంధిత వీఆర్ఓని సస్పెండ్ చేశామని తెలిపిన ఆర్డీఓ వాణి..

*గతంలో వచ్చిన ఫేక్ పట్టాల ఆరోపణలపై లోతుగా విచారణ చేస్తున్నామని మీడియాకు తెలిపిన ఆర్డీఓ వాణి…*



ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులకు ఏ మాత్రం తెలియకుండా ఫేక్ హౌస్ సైట్ పట్టా ఇచ్చారన్న ఆరోపణలపై 11వ డివిజన్ VRO శ్రీదేవిని సస్పెండ్ చేసినట్టు RDO వాణి తెలిపారు.

ఒక పక్క ఫేక్ పట్టాల పంపిణీ చేశారన్న ఆరోపణలపై JC అధ్యక్షతన త్రీమెన్ కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో VRO 11వ డివిజన్ లో రోడ్ సైడ్ ఆక్రమణదారునికి ఫేక్ పట్టా ఇచ్చారని తమ విచారణలో తేలిందన్నారు.

దీనిపై VROని సస్పెండ్ చేశామన్నారు.

Also read

Related posts

Share via