SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

వైసీపీలో పేర్ని నాని లాంటి వ్యక్తుల తీరు వల్ల విరక్తి చెందాను..వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి పేర్ని నాని..

జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి..

వైసీపీలో పేర్ని నాని లాంటి వ్యక్తుల తీరు వల్ల విరక్తి చెందాను..

టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన బాలశౌరి

బాలశౌరికి అభినందనలు తెలిపిన కొనకళ్ల నారాయణరావు, కొల్లు రవీంద్ర

టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కలిసి మచిలీపట్నం పార్లమెంట్ లో ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్న బాలశౌరి

మచిలీపట్నంలో స్థానిక నాయకత్వం అభివృద్ధిని అడ్డుకుంటోంది..

ఒక ఎంపీగా ఎన్నో ప్రాజెక్ట్ లు మచిలీపట్నంకు తీసుకొచ్చా..

బందరు పోర్టు పనులు ప్రారంభమయ్యాయంటే అది నా కృషే..

పట్టాభి సీతారామయ్య, పింగళి వెంకయ్య వంటి స్వాతంత్ర సమరయోధులను విస్మరించిన వ్యక్తులు మచిలీపట్నంలో ఉన్నారు..

యూనియన్ బ్యాంక్ వాళ్లతో మాట్లాడి పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి రూ.40కోట్లు తెచ్చా..

సీఎం జగన్ రెండు ఎకరాలు స్థలం కేటాయించారు..

కానీ స్థానిక వైసీపీ నాయకత్వం స్మారక భవనాన్ని అడ్డుకుంది..

అనుమతులు రాకుండా చేసింది..

స్మారక భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలం పక్కనే 2 ఎకరాల్లో వైసీపీ కార్యాలయం  కట్టుకున్నారు..

అతి పెద్ద పార్టీ బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే ఢిల్లీలో ఎకరం స్థలంలో నిర్మించారు..

ఒక జిల్లా వైసీపీ కార్యాలయానికి రెండు ఎకరాల స్థలం అవసరమా..?

పార్టీ కార్యాలయం కడితే కట్టుకున్నారు…

పట్టాభి స్మారక భవన నిర్మాణాన్ని అడ్డుకోవడం వల్ల మీకొచ్చే మేలు ఏమిటి..!?

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మన మచిలీపట్నం పక్కనున్న భట్లపెనుమర్రు వాసి…

అటువంటి వ్యక్తిని గౌరవించుకోలేని పరిస్థితిలో వైసీపీలో ఉన్నారు..

మెడికల్ కాలేజ్ కు పింగళి వెంకయ్య గారి పేరు పెట్టాలని సీఎం జగన్ కు లేటర్ రాశాను..

పింగళి పేరు పెట్టాల్సిన అవశ్యకతను సీఎం గారికి వివరించాను..

కానీ స్థానిక ఎమ్మెల్యే దానికి అడ్డుపడ్డారు..

అభివృద్ధిని అడ్డుకుంటున్న స్థానిక నాయకత్వం తీరుపై సీఎంకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు..

ఇటువంటి చర్యలకు తాను విరక్తి చెంది వైసీపీని వీడాను..

ఇప్పటికైనా మచిలీపట్నం ప్రజలు అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా…

Also read

Related posts