*చంద్రగ్రహ జననం – 9*
*”గురువుగారూ ! చంద్రుడి జననం గురించి చక్కగా చెప్పారు. పతివ్రత అయిన శీలవతి జీవితం బాగుపడింది. అనసూయకు సంతానం కలిగింది. ఆ రెండు మార్పులకు మూలం మాండవ్య మహర్షి శాపం ! శూలానికి గుచ్చబడిన ఆ మాండవ్య మహర్షి ఏమయ్యాడో మీరు చెప్పడం మరిచిపోయారు !”* చిదానందుడు గురువు నిర్వికల్పానందతో అన్నాడు.
నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. “మరిచిపోలేదు నాయనా ! మనం శ్రవణం చేస్తున్న నవగ్రహ చరిత్రతో ఆ మహర్షికి అనుబంధం అంతమాత్రమే ! అంచేత చెప్పకుండా దాటవేశాను.”*
*”ఆయన గురించి తెలుసుకోవాలని ఉత్కంఠగా వుంది, గురువుగారూ!”* విమలానందుడు అన్నాడు.
*”సరే. క్లుప్తంగా చెప్తాను. ‘శూలప్రోతం’ శిక్ష అనుభవిస్తున్న మాండవ్యుడు నిరపరాధి అని తెలుసుకున్న రాజు, ఆయనను శూలం నుండి కిందకు దింపించాడు. అయితే కంఠం దాకా పోయిన ఆ శూలం లాగితే రాలేదు. పదునుగా ఉన్న అగ్రభాగం ఆయన శరీరంలోని కంఠభాగంలో విరిగి, అలాగే వుండిపోయింది. అప్పట్నుంచీ ఆయన ‘ఆణిమాండవ్యుడు’గా ప్రసిద్ధి చెందాడు. మరొక విశేషమేమంటే ఆ మాండవ్య మహర్షి శాపం వల్లే యమధర్మరాజు ద్వాపరయుగంలో భూలోకంలో ‘విదురుడు’గా జన్మించాడు!”” అంటూ ముగించాడు నిర్వికల్పానంద.
*”గురువుగారూ…. ఇప్పుడు కుజగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తారా ?”* సదానందుడు అడిగాడు.
*”కుజుడు ఎవరికి జన్మించాడు. గురువు గారూ ?”* శివానందుడు అడిగాడు
నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *”నవగ్రహాల గురించి ఆలకించాలని మీరంతా చాలా ఆత్రుతగా వున్నారు. ఇప్పుడు, ఇక్కడ మన ఆశ్రమంలో జరుగుతున్నట్టే – కుజుడి జననం గురించి చర్చ సత్యలోకంలోనూ జరిగింది. సరస్వతీ బ్రహ్మలు పద్మాసనాల మీద కూర్చుని వున్నారు. బ్రహ్మగారి మానసపుత్రుడూ, విశ్వవార్తాహరుడూ అయిన నారదుడు. చేరుకుని, తన జననీ జనకులకు నమస్కరించాడు…”” అంటూ కథనం ప్రారంభించాడు.
*”కావాలంటే మన నారదుణ్ని అడగండి !”” అంది సరస్వతి చిరునవ్వు నవ్వుతూ. “ఏమిటి జననీ ?”* నారదుడు కుతూహలాన్ని అణచుకోకుండా అడిగాడు.
*”అది కాదు, నారదా ! మీ జనకుల అంశ అనసూయ కడుపు పంటగా చంద్రుడు జన్మించాడు కదా ! ఈ బ్రహ్మదేవుల కన్నా, ఆ బాలుడే అందంగా ఉన్నాడు అన్నాను. నేను కాదంటున్నారు ప్రాణేశ్వరులు!”* సరస్వతి నవ్వుతూ అంది.
“పసిగుడ్డుతో మాకు పోలికా !”” బ్రహ్మ నవ్వు దాచుకుంటూ అన్నాడు. *”నువ్వు చెప్పు నారదా… ఈయనగారు అందంగా ఉన్నారా, ఆ బాలుడు అందంగా ఉన్నాడా ?”* సరస్వతి బ్రహ్మను వాలుగా చూస్తూ నారదుణ్ణి అడిగింది.
*”నారాయణ ! అమ్మ ముందు అసత్యం పలకరాదు ! చంద్రుడే అందగాడు !”* అంటూ నారదుడు ఓరకంటితో బ్రహ్మ ముఖాలను పరిశీలించాడు.
బ్రహ్మ చిరునవ్వులు కురిపిస్తున్నాడు. “ఆ మాత్రం మాకు తెలియదా ఏమిటి ? చంద్రుడు అందచందాలలో అందరినీ తలదన్నే విధంగా ఉండాలని అతని జననానికి పూర్వమే మేము సంకల్పించాం కదా !”*
*”సత్యలోక ప్రభువుల నోట సత్యం పలికించడానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో చూశావా, నారదా !”* సరస్వతి నవ్వుతూ అంది. నారదుడూ, బ్రహ్మ శృతి కలిపారు. “నారదా ! బాలచంద్రుడు ఎలా ఉన్నాడు. ?”* సరస్వతి కుతూహలంగా అడిగింది. “ఇంకా అనసూయ స్తన్యం త్రాగుతూనే ఉన్నాడా ?”*
*”నారాయణ ! మాతా… మీరు కాలగణనను నిర్లక్ష్యం చేసినట్టున్నారు. మన చంద్రుడిప్పుడు పాలు తాగే పసివాడు కాడు. అరణ్యంలో తిరుగాడుతూ దర్భలూ , సమిధలూ ఏరి తెస్తున్నాడు. తండ్రి అత్రి మహర్షి అధ్యాపకత్వంలో వేద శాస్త్రాలు ఔపోసన పడుతున్నాడు !”* నారదుడు వివరించాడు.
*”అలాగా !”* సరస్వతి ఆశ్చర్యంతో అంది. ‘‘”మరి నవగ్రహాలలో మూడవ గ్రహం ఆవిర్భవించాలి కదా !”*
*”ఔను ! ఆ కార్యం పరమేశ్వరుడి ద్వారా జరిగితే బావుంటుంది…”” బ్రహ్మ సాలోచనగా అన్నాడు.
*”పరమేశ్వరుడా…!”* ఆశ్చర్యపోయింది సరస్వతి.
“”శ్రీమహావిష్ణువు నుండి మొదటి గ్రహదేవత సూర్యుడు అవతరించాడు. మా అంశతో రెండవ గ్రహదేవత చంద్రుడు ఉదయించాడు. త్రిమూర్తులలో ఇక మిగిలింది. శివుడే ! ఆయన మూలంగా మూడవ గ్రహం ఆవిర్భవిస్తే….” *
*”నారాయణ !”* నారదుడు ఉత్సాహంగా అడ్డు తగిలాడు. “”జనకా ! అయితే, వెళ్ళి కైలాసవాసుణ్ని హెచ్చరించమని ఆజ్ఞా !””
*”మా జనకుల సంకల్పమూ, మా సంకల్పమూ అదే, పుత్రా !”* బ్రహ్మ అన్నాడు. నారదుడు ఆలస్యం చేయకుండా నిష్క్రమించాడు.
శ్రీ గురు దత్తా
సేకరణ… ఆధురి భాను ప్రకాష్