సద్గురు జగ్గీవాసుదేవ్‌కి ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేశారు ఢిల్లీలోని అపోలో వైద్యులు. MRI స్కాన్ ద్వారా 3,4 వారాలుగా బ్రెయిన్‌లో బ్లీడింగ్‌ని గుర్తించిన వైద్యులు.. అత్యవసరంగా సర్జరీ చేశారు. అయితే ప్రస్తుతం వాసుదేవ్ కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్ సైతం తొలగించినట్లు వివరించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ మెదడు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేశారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 17న వాంతులు, తీవ్రమైన తలనొప్పితో సద్గురు ఆస్పత్రికి వచ్చారు. ఆయన్ను పరీక్షించిన డాక్టర్ వినిత్ MRI తీయాలని సిబ్బందికి సూచించారు. ఆ రిపోర్టులో సద్గురు మెదడులో వాపుతో పాటు భారీ రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే వైద్యులు అత్యవసర బ్రెయిన్ సర్జరీ చేశారు. ఢిల్లీకి చెందిన డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీల బృందం ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స చేసింది. ప్రస్తుతం వెంటిలేటర్ తొలగించామని.. సద్గురు కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.
సద్గురు గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు ఆయన శిష్యలు చెబుతున్నారు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, తగ్గుతుందని భావించి సాధారణ రోజువారీ షెడ్యూల్, సామాజిక కార్యకలాపాలను కొనసాగించినట్లు చెబుతున్నారు. 8 మార్చి 2024న ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహా శివరాత్రి వేడుకలను కూడా ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే
Also read
- శారీరకంగా వాడుకొని యువతిని మోసం చేసిన ప్రియుడు ప్రవీణ్…. వీడియో
- ఈ కోనలో వెలసిన నృసింహస్వామికి నారద, తుంబురుడు రోజూ పూజలు.. సాక్ష్యంగా తులసీదళాలు.. ఆలయం ఎక్కడంటే..
- Vaikunta Ekadasi 2025: 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం తెలుసుకోండి..
- Malavya Rajyog in 2025: కొత్త ఏడాదిలో మీన రాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులకు చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే..
- Shabarimala: శబరిమల ఆలయంలో మండల పూజ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి