పేకాట, క్రికెట్ బెట్టింగ్, పొలిటికల్ బెట్టింగులలో ఇప్పటి వరకు ఇలాంటి బెట్టింగ్ ఎవరూ చూసి ఉండరు..! రాజకీయాల్లో గెలుపు, ఓటములపై పందెలు కాయడం సహజం. కానీ ఓ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకే ట్రెండ్ సెట్ చేశాడు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ టికెట్ శ్రీధర్ రెడ్డికి రాదని ఓ వ్యక్తి పందెం వేశాడు. శ్రీధర్ రెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇస్తే, అరగుండు కొట్టించుకుంటానని, సగం మీసం తీసేస్తానని పందెం కాశాడు. చివరికి వైసీపీ అధిష్టానం పుట్టపర్తి వైసీపీ టికెట్ శ్రీధర్ రెడ్డి పేరు ఖరారు చేసింది. అన్న మాట ప్రకారం శ్రీధర్ రెడ్డికి టికెట్ వచ్చినందున అరగుండు కొట్టించుకుని, సగం మీసం తీయించుకున్నాడు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి.

పుట్టపర్తి టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇవ్వడాన్ని మహేశ్వర్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. పుట్టపర్తిలోని సత్యమ్మ దేవాలయం ఎదుట మహేశ్వర్ రెడ్డి అరగుండు, అర మీసం తీయించుకున్నాడు. అన్నమాట ప్రకారం అర గుండు, అర మీసం తీయించుకున్న మహేశ్వర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డికి ఓటు వేయొద్దని కోరుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్రీధర్ రెడ్డికి టికెట్ రాకూడదని పందెం కాసిన మహేశ్వర్ రెడ్డి, గతంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేశాడు. బెట్టింగ్ బంగార్రాజు మహేశ్వర్ రెడ్డి అర గుండు, అర మీసం తీయుంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి పందెం కూడా ఉంటుందని ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





