తెలంగాణలో పాస్‌పోర్ట్ స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతుంది. మొన్నటి వరకు 18 మంది నిందితుల పాత్రని సిఐడి పోలీసులు కనుగొన్నారు. ఈ 18 మంది ప్రస్తుతం చంచల్గూడా జైల్లో ఉన్నారు. వీరిని కస్టడీలా భాగంగా అదుపులోకి తీసుకొని విచారించగా మరికొంత మంది పోలీసుల పాత్ర బయటపడింది. ఈ 18 మందిలో పలువురు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నలుగురు నీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు పోలీస్ సిబ్బంది కాగా ఒక పాస్పోర్ట్ ఏజెంట్ ఉన్నారు.
శ్రీలంక నుండి వచ్చిన రెఫ్యూజీలకు నకిలీ పత్రాలు సృష్టించి వీటి ద్వారా పాస్‌పోర్ట్‌లు ఇప్పించారు. ఎస్బి ఎంక్వయిరీ సైతం మేనేజ్ చేసుకుని యధేచ్చగా పాస్ పోర్ట్‌లు పొంది ఇక్కడి నుండి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. అయితే వీరికి పాస్పోర్ట్లు జారీ చేయడంలో ఇప్పటివరకు 22 మంది పాత్రను సిఐడి పోలీసులు గుర్తించారు. వీరిలో ఎక్కువ శాతం పాస్పోర్ట్ ఏజెంట్ల తో పాటు పోలీసులు సైతం అన్నారు. ముఖ్యంగా కరీంనగర్ జగిత్యాల జిల్లాలకు చెందిన ఎస్.బి అధికారులు చేతివాటం ప్రదర్శించి ఏజెంట్లతో కుమ్మకైనట్లు సిఐడి దర్యాప్తులో బయటపడింది.
తాజాగా సిఐడి అరెస్టు చేసిన వారిలో హైదరాబాద్ కి చెందిన పోలీసుల పాత్ర సైతం బయటపడింది. మారేడ్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏ ఎస్ ఐ గాపనిచేస్తున్న తిమ్మప్ప, పంజాగుట్ట ట్రాఫిక్ పిఎస్ లో పనిచేస్తున్న నజీర్ భాష, శి టీం ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు ను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు మొదటి దశలో అరెస్టు చేసిన 18 మందిలోనూ పలువురు ఎస్బి ఆధికారులు ఉన్నారు. సాధారణంగా పాస్‌పోర్ట్ జారీ చేసే క్రమంలో ఎస్బి ఎంక్వైరీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే చాలా వరకు నకిలీ పాత్రలు కావటం, అడ్రస్‌లు మొత్తం ఒకే చోట ఉండేలాగా పత్రాలు సృష్టించిన ఎక్కడ తప్పు పట్టకుండా ఎస్బి ఎంక్వైరీ ఓకే చేసేసారు. దీంతో ఎస్బి అధికారుల పాత్ర బయటపడింది. వీరితో పాటు పలువురు పాస్‌పోర్ట్ సిబ్బంది పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటివరకు 125 పాస్పోర్ట్ లు నకిలీ పత్రాలతో జారి అయినట్టు సిఐడి దర్యాప్తులో బయటపడింది. గతంలో 95 పాస్‌పోర్ట్‌లను గుర్తించగా తాజాగా మరో 30 పాస్ పోర్టులు ఇదే తరహాలో జారీ అయినట్టు సిఐడి గుర్తించింది. ఈ 125 పాస్‌పోర్ట్‌లో పొందిన వ్యక్తుల వివరాలను సిఐడి పోలీసులు ఆర్పీఓకు అందజేశారు. అయితే ప్రస్తుతం పాస్ పో్ర్ట్ పొందిన వాళ్లు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనే దానిపై సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం