SGSTV NEWS online
SpiritualTelangana

కార్తీక మాసంలో శివపార్వతుల శాంతి కళ్యాణం*

భద్రాచలం, నవంబరు 29:



*కార్తీక మాసంలో శివపార్వతుల శాంతి కళ్యాణం*

భద్రాచలం, నవంబరు 29:
శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న
శ్రీ అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస శివపార్వతుల శాంతి కళ్యాణం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

కార్తీక మాసం శివారాధనకు విశేషమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో శివపార్వతుల కళ్యాణాన్ని దర్శించడం వల్ల కుటుంబాల్లో శాంతి, సౌఖ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.

ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు శివాలయ ప్రాంగణం లో పోలీస్ అప్పారావు గారు నిర్మించిన కళ్యాణ మండపంలో ఉభయ కళ్యాణదాతలు, భక్తుల సమక్షంలో వేడుక ప్రారంభమైంది.

భద్రాచల దేవస్థానం కార్యనిర్వహణాధికారి
శ్రీ కే. దామోదరరావు, ఏఈవో శ్రీ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

వేద పండితులు శ్రీ లింగాల ప్రసాద్ అవధాని, శ్రీ వరప్రసాద్ వేద మంత్రోచ్చారణల నడుమ, ఆలయ అర్చకులు శ్రీ అయలూరి సుబ్రహ్మణ్య శర్మ (నానిబాబు) ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువును నిర్వహించారు. శ్రీ డి.వి. శంకరరావు, శ్రీ రవి, శ్రీ కోవూరి శ్రీనివాస్, శ్రీ మురళి తదితరులు సహకరించారు.

కళ్యాణం అనంతరం దేవస్థానం తరఫున ముత్తైదువులకు తాంబూలాలు అందజేశారు.  భక్తులకు పులిహోర, చక్రపొంగలి, కదంబం, దద్దోజనం ప్రసాదాలను పంపిణీ చేశారు.

Related posts