SGSTV NEWS online
CrimeNationalTelangana

తెలంగాణ ఈగల్ ఫోర్స్ దెబ్బ.. మహారాష్ట్రలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. కోట్ల విలువైన MD సీజ్!



తెలంగాణ ఈగల్ ఫోర్స్ అందించిన కీలక నిఘా సమాచారంతో మహారాష్ట్రలో భారీ డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. నాగ్‌పూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు రూ.1.75 కోట్ల విలువైన 1.47 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు.


హైదరాబాద్‌/నాగ్‌పూర్‌: తెలంగాణ ఈగల్ ఫోర్స్ అందించిన కీలక నిఘా సమాచారంతో మహారాష్ట్రలో భారీ డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. నాగ్‌పూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు రూ.1.75 కోట్ల విలువైన 1.47 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


నాగ్‌పూర్‌లోని సక్కర్దారా, మహల్‌ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 820 గ్రాముల మెఫెడ్రోన్‌ (MD), 650 గ్రాముల క్రిస్టలైన్‌ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాయి. నిందితులు డ్రగ్స్‌ను చిన్న చిన్న పరిమాణాల్లో ప్యాక్‌ చేసి విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్కో ప్యాకెట్‌ను సుమారు 2 గ్రాముల బాల్‌గా తయారు చేసి రూ.3,500 చొప్పున విక్రయించాలని భావించినట్లు సమాచారం.



నిందితుల నుంచి రూ.1,40,150 నగదు, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ వ్యవహారంలో ఇండోర్‌కు చెందిన జితు, రాజస్థాన్‌కు చెందిన సంజయ్‌ విశ్వకర్మ అలియాస్‌ అక్కీ భాయ్‌ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఈ కేసు దర్యాప్తు మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ వరకు విస్తరించింది. డ్రగ్స్‌ సరఫరా వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు, కొనుగోలుదారులు, ఇతర లింకులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ అందించిన నిఘా సమాచారం, మహారాష్ట్ర పోలీసుల అంతర్రాష్ట్ర సమన్వయం ఈ ఆపరేషన్‌లో కీలకంగా మారాయి. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also read

Related posts