రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పరిణయ గార్డెన్ ఫంక్షన్ హాల్లో విద్యుత్ షాక్‌కు గురై హనుమాన్ మాల ధరించిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం రాయిల్లాపురం తండాకు చెందిన కట్రావత్ రాజేష్ (26) బ్రాహ్మణపల్లిలోని పరిణయ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఫ్రూట్ సలాడ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అయితే రోజులాగే శుక్రవారం కూడా పనిలో నిమగ్నమై ఉన్న రాజేష్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది.
గమనించిన తోటి సిబ్బంది వెంటనే రాజేష్‌ను తుర్కయాంజల్‌లోని తారా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే రాజేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తిరిగి పరిణయ గార్డెన్ వద్దకు తీసుకొచ్చారు.
ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు, గిరిజన సంఘాలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగాయి. సమాచారం అందుకున్న బంధువులు, స్థానికులు వందల సంఖ్యలో ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులకు, ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగించారు.
Also read
- హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి అరెస్టు
- బెంగళూరులో 1,154 స్పా, మసాజ్ పార్లర్లపై తనిఖీ
- కాల భైరవ అష్టమి.. డిసెంబర్ 1న ఈ 5 ఆచారాలు పాటిస్తే భైరవుడి అనుగ్రహం లభిస్తుందట!
- కార్తీక సోమవారం వ్రత మహిమ.. కుక్కగా పుట్టిన మహిళకు కైలాస ప్రాప్తి ఎలా కలిగిందో తెలుసా?
- కార్తీక మాసంలో శివపార్వతుల శాంతి కళ్యాణం*
భద్రాచలం, నవంబరు 29:





