November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

తాగునీటి సమస్యపై ప్రశ్నిస్తే దాడి

ఓట్లు అడిగేందుకు వెళుతున్న వైకాపా నేతలకు ప్రజల నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నిస్తుండటంతో అసహనంతో దాడులకు తెగబడుతున్నారు.




అనంత నగరపాలక, : ఓట్లు అడిగేందుకు
వెళుతున్న వైకాపా నేతలకు ప్రజల నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నిస్తుండటంతో అసహనంతో దాడులకు తెగబడుతున్నారు. సోమవారం అనంతపురం నగరంలోని 39వ డివిజన్ పరిధి పార్వతమ్మ కాలనీలో.. ఇంటింటా వైకాపా పేరుతో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
ప్రచారం చేశారు. అదే కాలనీలో నివాసం ఉంటున్న
మహిళ జి. లక్ష్మీదేవి ఇంటివద్దకు వెళ్లగానే.. ‘ఏ మొహం పెట్టుకొని వచ్చారు. తాగునీరు సక్రమంగా సరఫరా చేయలేదు. రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఎందుకని నిర్మాణాలు చేపట్టరు?’ అంటూ సదరు మహిళ ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. వెంటనే ఆయన అనుచరులు ఆమె ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. దీంతో ఆమె మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘కుళాయి కనెక్షన్ కోసం ఏడాది నుంచి నగరపాలక కార్యాలయం, డివిజన్ కార్పొరేటర్ చుట్టూ తిరిగాం. దానిపై నేను ప్రశ్నించినందుకు సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే.. నన్ను దాడిచేశారు’ అంటూ విలపించింది. సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శితో కలిసి అనంతపురం నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

Also read

Related posts

Share via