SGSTV NEWS online
CrimeTelangana

అర్ధరాత్రి ప్రమాదం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి



మాదాపూర్‌: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందింది. మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ కెవి. సుబ్బారావు తెలిపిన మేరకు.. కొతిలి అక్షయ్‌కుమార్‌ (28) ఖాజాగూడలోని ఎల్‌ఎల్‌పి కంపెనీలో ప్రైవేట్‌ ఉద్యోగిగా, ప్రొడక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితురాలు సుష్మాచౌదరి (28) కొండాపూర్‌లోని ఒక పీజీ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది.

వీరిద్దరూ కలిసి మాదాపూర్‌లోని స్నేహితుడు ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేశారు. మంగళవారం అర్ధరాత్రి అక్షయ్‌కుమార్‌ తన ద్విచక్రవాహనంపై సుష్మా చౌదరితోపాటు  కొండాపూర్‌ వైపు బయలుదేరారు. సీఐఐ జంక్షన్‌ సమీపానికి చేరుకోగానే, అక్షయ్‌కుమార్‌ మోటార్‌సైకిల్‌ను నిర్లక్ష్యంగా నడపడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు డివైడర్‌ను ఢీకొని, డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న సుష్మాచౌదరి మోటార్‌ సైకిల్‌పై నుంచి కిందపడడంతో ఆమె తలకు, ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న వారు ఆమెను మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు నిర్ధారించారు. స్నేహితుడు ఉల్లూర్‌ శ్రీనివాస్‌ ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Also read

Related posts