SGSTV NEWS online
Andhra PradeshCrime

కాకినాడ జిల్లాలో ఘోరం.. 10వ తరగతి విద్యార్థులపై.. కుల వివక్షతో ప్రిన్సిపాల్, పీటీ టీచర్ దాడి!



Gurukul School: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్
నందు విద్యార్థినిల పై అమానుషం ప్రవర్తించి దుర్భశలాడి, గాయ పరిచిన ప్రిన్సిపాల్, పి.టి టీచర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం వెలమకొత్తురు గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలను వివక్ష చూపిస్తూ వేదింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్, పిటి టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అధికారులను తల్లిదండ్రులు కలిసి ఫిర్యాదు చేశారు.

అసభ్యకరమైన పదజాలంతో..

నవంబర్ 7 ఉదయం స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న అసెంబ్లీలో ఎస్సీ కులానికి చెందిన 10వ తరగతి చదువుతున్న గంటపల్లి ధనుశ్రీ పశుపతి హర్షిని అనే ఇద్దరు విద్యార్థులను అసెంబ్లీ నుండి బయటకు పిలిచి వైట్ యూనిఫామ్ ధరించలేదని కారణంతో వెదురు కర్రతో అసభ్యకరమైన పదజాలం తో దూషిస్తూ ఎదుట విద్యార్థినిల ఎదుట గాయపరిచారని, వీరిలో గంటుపల్లి ధనుస్సురికి రెండు చేతుల పైన తీవ్ర గాయాలు అవ్వగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా విద్యార్థినిలపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు.

ప్రిన్సిపల్ పిటి టీచర్ కుల వివక్షత..

దళిత విద్యార్థులపై ప్రిన్సిపల్ పిటి టీచర్ కుల వివక్షత కారణంగా అమానుషంగా దాడి చేసి అవమానించిన వారిపై శాఖపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మా పిల్లలాగే మిగిలిన విద్యార్థులపై ఒత్తిడి తీసుకువచ్చి దాడి చేస్తున్నారని, ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తాం అని చెప్తుంటే ఇక్కడ మా పిల్లలపై వివక్ష చూపిస్తున్నారని, మేము ఇంకా ఎవరిని అడగాలని మా పిల్లలను ఎక్కడ చదివించుకోవాలని ప్రశ్నించారు.

తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి పిల్లలపై వివక్ష చూపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని పిల్లలు చదువుకునేలా ఏర్పాటు చేయాలని కోరారు.

Also read

Related posts