పాలకొండ రూరల్: పట్టణంలోని లుంబూరువారి వీధికి చెందిన దుప్పాడ కుమారి(28) రోడ్డు ప్రమాదంలో మరణించింది. వివరాలిలా ఉన్నాయి. కుటుంబ పోషణలో భాగంగా భర్త సింహాంద్రికి తోడుగా నిలిచేందుకు తాను కూడా కష్టపడాలని నిర్ణయించుకున్న కుమారి మండలంలోని పణుకువలస సమీపంలో గల ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. రోజులాగానే సహచరులతో కలిసి పనులకు ఆదివారం పయనమైంది. తనతోపాటు పని చేస్తున్న శ్రీరామూర్తి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రాజుపేట కానా వద్ద రోడ్డుపై ముంగిస అడ్డుగా రావడంతో బైక్ సడన్ బ్రేక్ వేయగా వాహనం అదుపుతప్పింది.
దీంతో వాహనం వెనుక కూర్చున్న కుమారి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమె గుండె, తల బలంగా రోడ్డును తాకడంతో అపస్మాకర స్థితికి చేరుకుంది. వెనుక ఆటోలో వస్తున్న సహచరులు ప్రమాదాన్ని గమనించి తక్షణమే తమ ఆటోలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీరామూర్తి స్వల్పగాయాలతో బయటపడగా కుమారి పరిస్థితి విషమించడంతో వైద్యులు శ్రీకాకుళం రిఫర్ చేసారు. అక్కడ చికిత్స పొందుతూ కుమారి మృతిచెందింది. కుమారి మరణించడంతో భర్త, ఇద్దరు కుమార్తెలు గుండెలవిసేలా రోదించారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025