SGSTV NEWS online
CrimeTelangana

అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్ జెండర్ మృతి



హైదరాబాద్: కీసర-ఘట్కేసర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో అనుమానస్పద స్థితిలో ఓ ట్రాన్సో జెండర్ మృతిచెందింది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు బ్రిడ్జి కింద దుర్వాసన రావడాన్ని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా బోగారానికి చెందిన ట్రాన్స్ జెండర్ శేఖర్ అలియాస్ స్వీటి(35)గా గుర్తించారు.

శేఖర్ మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టపక్కల వెతికినా లభించలేదు. అనంతరం కీసర ఓఆర్ఆర్ వద్ద అనుమానాస్పదంగా మృతిచెందింది. కాగా మూడు రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడటం వల్ల మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. పోలీసులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts