SGSTV NEWS online
CrimeTelangana

గొంతునులిమి.. ప్రాణం తీసి..



హైదరాబాద్, రహమత్నగర్: సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల బాలుడి గొంతునులిమి అత్యంత దారుణంగా ప్రాణం తీశాడు.. తండ్రి వరస అయిన కిరాతకుడు. రాత్రంతా గదిలోనే ఉండి తెల్లవారుజామున తల్లి వచ్చాక నిలదీయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

బోరబండ ఎన్హెచ్్వ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్Çకు చెందిన పవార్ దుర్గ(23) భర్త మధు కొంత కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఓ కుమారుడు, కుమార్తెను నిజామాబాద్లో ఉంటున్న బావ వద్ద ఉంచి.. çహృద్రోగ సమస్యతో బాధపడుతున్న చిన్న కొడుకు విజయ్(5)తో కలిసి దుర్గ బోరబండలో ఉండేది. ఫుట్పాత్పై ఇనుప వస్తువులు తయారు చేసే దుకాణంలో పనిచేసేది.

ఈ క్రమంలో నిజామాబాద్కు చెందిన నల్లవరపు విద్యాసాగర్(33)కు ఆమెతో పరిచయం ఏర్పడింది. నాలుగు నెలల క్రితం బోరబండ అజాంనగర్ బీబ్లాక్ లో ఇల్లు అద్దెకు తీసుకుని వీరు సహజీవనం చేస్తున్నారు. ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుండగా.. అతడు పని వదిలేసి మద్యం తాగుతూ ఇంట్లోనే ఉండేవాడు. దుర్గ ఇంట్లో లేని సమయంలో బాలుడిని తరచూ కొట్టేవాడు.

ఆదివారం సాయంత్రం విజయ్్న ఇంట్లోనే వదిలి తల్లి నైట్ డ్యూటీకి వెళ్లింది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన విద్యాసాగర్ నిద్రిస్తున్న విజయ్ గొంతు నులిమి తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలుడు ప్రాణాలు వదిలాడు. ఇంట్లోనే రాత్రంతా ఉన్నాడు. అనంతరం ఏమీ తెలియనట్లు దుర్గ పనిచేసే ఆసుపత్రికి ఫోన్ చేసి విజయ్కు ఫిట్స్ వచ్చి కిందపడిపోయాడని చెప్పాడు.

ఆమె ఇంటికి వచ్చి చూడగా విజయ్ చనిపోగా.. మెడపై గాయాలు కనిపించాయి. విద్యాసాగర్ను నిలదీయడంతో తలుపు మూసి ఆమె గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయాడు. జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి, ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఎన్హెచ్వి రవికుమార్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

Also read

Related posts