SGSTV NEWS online
AstrologySpiritual

Diwali 2026: రాసిపెట్టుకోండి..దీపావళి నుంచి నక్కతోక తొక్కే రాశులివే..!



Diwali 2026 Astrology: నవంబర్ 9న దీపావళి తర్వాత గ్రహాల సంచారంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. శని, శుక్ర, బుధ గ్రహాలు వక్రగతి నుంచి బయటకు రావడం, గురు, కుజుల రాశి మార్పులతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. డిసెంబర్ 5లోపు అనేక శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవి? ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి?

మేషం: ఈ రాశివారికి అయిదు గ్రహాలు అనుకూలమవుతున్నందువల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలను కొద్ది మార్పులతో లాభాల బాటపట్టిస్తారు. జీవితం ప్రశాంతంగా సాగుతుంది.

మిథునం: ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపట్టడానికి బాగా అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యో గాలకు ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లోకి దిగాలన్న ఉద్యోగుల కల నెరవేరే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. విదేశీ సంబంధం లేదా సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయ మయ్యే సూచనలున్నాయి. ఆదాయం అనేక విధాలుగా పెరగడానికి బాగా అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశివారు ఉద్యోగపరంగా, వృత్తి, వ్యాపారాలపరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు శుభవార్తలు వింటారు. కొద్ది ప్రయత్నంతో మనసులోని ఆశలు, కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో సీనియర్లను అన్ని విధాలుగానూ మించిపోతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలు వృద్ధి చెందుతాయి.

తుల: ఈ రాశివారికి మరో రెండున్నర నెలల పాటు శుక్ర, గురు, శనులు అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ సునాయాసంగా నెరవేరుతుంది. ఆస్తి సమస్యలు, కోర్టు కేసులు కొద్ది ప్రయత్నంతో అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తులు వృద్ధి చెందుతాయి. సంపద బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన స్థాయి లబ్ధి పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలనిస్తాయి.


ధనుస్సు: గురు, శుక్ర, బుధుల అనుకూలత వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్న కొద్ది ప్రయత్నంతో అంచ నాలకు మించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాల్ని రాజీ మార్గంలో పరిష్క రించుకుని లబ్ధి పొందుతారు. ఆదాయ వృద్ధి, గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మకరం: ఈ రాశికి దాదాపు జనవరి వరకు శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉంటున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.


Related posts