హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది.
హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ ఇందిరానగర్లో నివాసం ఉంటున్న గండమళ్ల చందన (23) మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. అయితే, చందన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం ప్రాంతానికి చెందిన తుడుము శివతో గత ఏడాదిన్నరగా ప్రేమలో ఉంది.
కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రేమికుడైన శివ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని చందన గతంలోనే తన అక్క వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివ పెడుతున్న మానసిక వేధింపులు తాళలేకపోయిన చందన.. అక్టోబర్ 22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురై, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చందన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తమ కుమార్తె మృతికి ప్రియుడు శివ వేధింపులే ప్రధాన కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.
Also read
- కట్టుకున్నవాడే కాలయముడయ్యాడా?
- గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్.. కత్తితో బెదిరించి సంతకాలు
- ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం
- ఉద్రిక్తత.. బిర్యానీ తిని ఇద్దరు చిన్నారులు మృతి?
- కృష్ణానదిలో నాటుపడవ మునక.. ఇద్దరు బాలురు మృతి





