కొన్ని సంవత్సరాలు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ రౌడీ షీటర్‌ను మంగళ్‌హాట్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నింతుడి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. అతనిపై దాదాపు 35కు పైగా కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ పాతబస్తీలోని మంగళ్‌హాట్ పోలీసులకు పరారీలో ఉన్న రౌడీషీటర్ చిక్కాడు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 35కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న అబేద్ బిన్ ఖలీద్ అలియాస్ అబేద్ అలియాస్ లల్లాను మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలలకు పైగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుడిని అక్టోబర్ 23న విశ్వసనీయ సమాచారంతో ఆర్.కె.పేట్ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడి వద్ద రిజిస్ట్రేషన్ నంబర్ లేని తెల్లరంగు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 మోటార్‌సైకిల్‌తో పాటు పదునైన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్.కె.పేట్, చిస్తిచమన్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల అబేద్‌పై 2005 నుంచి వివిధ నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. 2008లో అతడిపై రౌడీషీట్ తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో మూడుసార్లు పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్, ఆర్మ్స్ యాక్ట్ కేసులతో పాటు ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులోనూ అతడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది.
నిందితుడి కోసం మంగళ్‌హాట్ పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో అక్టోబర్ 23న అందిన పక్కా సమాచారంతో ఆర్.కె.పేట్ జంక్షన్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద లభించిన పదునైన కత్తి, రిజిస్ట్రేషన్ నంబర్ లేని మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకుని క్రైమ్ నంబర్ 470/2026 కింద ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25(1B)(b) ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Also read
- కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, తులసి పూజ ఎందుకు చేయాలి? లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం ఇలా చేయండి!
- శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు, కళ్లు అంటే అర్థం ఏమిటో తెలుసా?
- మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారు? దీని వెనుక అసలు కారణం ఇదే!
- Diwali 2026: రాసిపెట్టుకోండి..దీపావళి నుంచి నక్కతోక తొక్కే రాశులివే..!
- నేటి జాతకములు 26 అక్టోబర్, 2026





