సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లపురంలో విషాదం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్తున్న ఇద్దరు బాలురను కోతుల గుంపు వెంటపడటంతో వారు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో కిందపడిన 12 ఏళ్ల నిశాంత్ స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే బాలుడు మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.
కోతుల దాడి భయంతో పరుగెత్తి బాలుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లపురంలో విషాదఛాయలు నింపింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొక్క వీరబాబు కుమారుడు 12 ఏళ్ల నిశాంత్, సతీష్ కుమారుడు 11 ఏళ్ల మణేందర్ గ్రామంలోని చెరువు దగ్గరకు చేపలు పట్టడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక్కసారిగా కోతుల గుంపు వీరిపైకి దూసుకువచ్చింది. కోతులు వెంటపడటంతో భయాందోళనకు గురైన ఇద్దరు బాలురు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో నిషాంత్ కిందపడిపోగా, కొంత దూరంలో ఉన్న మణేందర్ గట్టిగా కేకలు వేశాడు. బాలుడి అరుపులకు కోతులు అక్కడి నుండి వెళ్లిపోయాయి.
అనంతరం మణేందర్ వెళ్లి చూసే సరికి నిషాంత్ స్పృహలేకుండా పడిపోయి ఉన్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు నిశాంక్‌ను చూసి.. హుటాహుటిన బైక్ పై ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.. అందుబాటులో లేకపోవడంతో 108కి సమాచారం ఇచ్చిన.. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు.
ఈ క్రమంలోనే.. వాహనం పెరిక సింగారం బ్రిడ్జ్ దగ్గరకు చేరుకునేలోపు 108 అంబులెన్స్ వచ్చింది. బాలుడిని పరిశీలించిన 108 సిబ్బంది అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. పోస్ట్‌మార్టం కోసం కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నిశాంత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
Also read
- మందు తాగి రోడ్డెక్కారు.. బండి ఆపిన పోలీసులకే క్లాస్ పీకారు! నడిరోడ్డుపై హైడ్రామా!
- చెరువుకు వెళ్తుండగా వెంటపడిన కోతుల గుంపు.. కుప్పకూలిన బాలుడు.. చివరకు..
- హైదరాబాద్‌లో సైబర్ మోసం.. లైఫ్ సర్టిఫికేట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగికి రూ. 11.69 లక్షలు టోకరా!
- ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆగని విషాదాలు.. తల్లితోపాటు గర్భంలోనే తనువుచాలించిన కవలలు
- సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో బిగ్ ట్విస్ట్.. అర్ధరాత్రి వరకు సీబీఐ విచారణ!





