రంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడుపునొప్పితో చికిత్స కోసం ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లిన ఓ వ్యక్తి, ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే మృతి చెందాడు. వైద్యం వికటించడం, వైద్యుడి నిర్లక్ష్యమే మరణానికి కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు క్లినిక్ ఎదుట ఆందోళనకు దిగారు. పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడుపునొప్పితో చికిత్స కోసం ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లిన ఓ వ్యక్తి, ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే మృతి చెందాడు. వైద్యం వికటించడం, వైద్యుడి నిర్లక్ష్యమే మరణానికి కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు క్లినిక్ ఎదుట ఆందోళనకు దిగారు. పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన వీర్లపల్లి విజయ్ కుమార్ (36) పండుగ సందర్భంగా మంచాల మండల పరిధిలోని నోముల గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఉదయం ఆయనకు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే మంచాల మండల కేంద్రంలోని గీత ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లారు. అక్కడ విజయ్ కుమార్‌ను పరీక్షించిన ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని, కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా అక్కడ విషాదం నెలకొంది.
వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు
విజయ్ కుమార్‌కు ఎలాంటి ముందస్తు పరీక్షలు నిర్వహించకుండా ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఈ ఘటన జరిగిందని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయామని కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే, మరణానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
క్లినిక్ ఎదుట బంధువుల ఆందోళన
విజయ్ కుమార్ మృతితో ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు క్లినిక్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తూ, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ, వైద్యపరమైన వివరాలు వెల్లడికావాల్సి ఉంది. విజయ్ కుమార్ మృతికి దారితీసిన కారణాలు, చికిత్సలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా అనే అంశాలపై అధికారులు విచరణ చేపట్టారు.
Also read
- కడుపునొప్పితో చికిత్స కోసం ప్రైవేట్ క్లినిక్‌కు వస్తే.. ప్రాణమే పోయింది..!
- లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఏపీ నుంచి హైదరాబాద్‌కు.. పెళ్లికి డబ్బులు లేవని పాడు పని..!
- వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..!
- రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన వ్యక్తి! వీడియో వైరల్
- Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు.. ఇంట్లోంచి 7 కిలోల వెండి, 90 గ్రాములు బంగారం మాయం.. వీడియో





