ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రేమజంట పెళ్లి కోసం దొంగలుగా మారారు. వనస్థలిపురం రాజరాజేశ్వరి ఆలయంలో వృద్ధురాలి బంగారు గొలుసును చోరీ చేశారు. పోలీసులు 24 గంటల్లోనే వారిని పట్టుకొని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ కోసం నేరం చేసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది, చట్టం ముందు అందరూ సమానులేనని పోలీసులు హెచ్చరించారు.
అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ పెళ్లి కోసం ఏకంగా దొంగలుగా మారారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రేమజంట వనస్థలిపురంలోని రాజరాజేశ్వరి దేవాలయంలో ఓ వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేశారు. అయితే చోరీ చేసి తప్పించుకోవాలనుకున్న ఆ జంటకు మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు షాకిచ్చారు. కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.
ప్రేమకు పెళ్లి అడ్డంకిగా మారిందో… పెళ్లికి డబ్బు సమస్యగా మారిందో తెలియదు కానీ.. చివరకు ఈ ప్రేమజంట దొంగతనం బాట పట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్నపూరెడ్డి, వరలక్ష్మి ప్రేమ వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మహానగరంకు వచ్చారు. అయితే వనస్థలిపురంలోని రాజరాజేశ్వరి దేవాలయంలో ఓ వృద్ధురాలిని టార్గెట్ చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. చోరీ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన నిందితులపై బాధితురాలి ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు నిందితుల ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నించారు. సీసీ కెమెరాల నుండి బస్సులు, ఆటోల వరకు తనిఖీలు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు ఫలించడంతో చోరీ జరిగిన 24 గంటల్లోనే ప్రేమజంటను పట్టుకున్నారు. నిందితుల నుంచి మూడు తులాల బంగారు గొలుసుతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వివాహం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఈ జంట చివరకు చోరీ కేసులో పోలీసులకు చిక్కింది. పెళ్లి కోసం దొంగతనం చేసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉండొచ్చు.. అందుకోసం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండొచ్చు.. కానీ అందుకోసం ఇతరుల సొత్తును దొంగిలిస్తే చట్టం ముందు నిలబడక తప్పదు అంటున్నారు మల్కాజిగిరి పోలీసులు.. ఆలయంలో వృద్ధురాలి బంగారు గొలుసు చోరీ చేసిన ప్రేమజంటను 24 గంటల్లోనే పట్టుకున్న వనస్థలిపురం పోలీసులు.. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Also read
- కడుపునొప్పితో చికిత్స కోసం ప్రైవేట్ క్లినిక్‌కు వస్తే.. ప్రాణమే పోయింది..!
- లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఏపీ నుంచి హైదరాబాద్‌కు.. పెళ్లికి డబ్బులు లేవని పాడు పని..!
- వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..!
- రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన వ్యక్తి! వీడియో వైరల్
- Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు.. ఇంట్లోంచి 7 కిలోల వెండి, 90 గ్రాములు బంగారం మాయం.. వీడియో





