వార ఫలాలు (అక్టోబర్ 18-24, 2026): మేష రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యతలు, లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల సుఖ సంతోషాలకు లోటుండదు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబపరంగా కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా ప్రార్థించడం చాలా మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు షష్ట స్థానంలో వక్రించి ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. ఆదాయం బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ వారం తప్పకుండా పరి ష్కారం అవుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూల వుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వృత్తి జీవితంలో యాక్టివిటి బాగా పెరుగుతుంది. ఉద్యోగాలు నిలకడగా, ప్రశాంతంగా పురోగమిస్తాయి. వ్యాపారాలు సంతృప్తికర స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతి బుధుడితో శుక్ర గ్రహం యుతి చెందడం, ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల రాబడికి, లాభాలకు లోటుండకపోవచ్చు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగ మిస్తాయి. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యతలు, లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం కానీ, వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. సుందరకాండ పారాయణం వల్ల ఆటంకాలు లేని శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశిలో గురువు సంచారం, చతుర్థంలో శుక్ర, బుధుల వల్ల శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. తేలిక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. మంచి పరిచయాలు కలుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని తేలికగా పూర్తి చేస్తారు. అధికార యోగం పడుతుంది. శివార్చన చేయడం వల్ల రాహు దోషం తగ్గుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
తృతీయ స్థానంలో నీచబడిన రవికి శుక్రుడితో యుతి వల్ల నీచభంగం కలిగింది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా సక్సెస్ అవు తాయి. తృతీయ స్థానంలో బుధుడి సంచారం వల్ల ఈ వారం ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండకపోవచ్చు. ముఖ్యమైన పనులు, వ్యవహా రాలు తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. సుబ్రహ్మణ్యాష్టక పఠనం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గురు, శుక్ర, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల మీద కాస్తంత శ్రద్ధ పెంచడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. గట్టి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆదాయ వృద్ధికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ మర్యా దలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కొన్ని ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. దుర్గాదేవికి ప్రార్థన చేయడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో భాగ్యాధిపతి బుధుడు యుతి చెందడం, దశమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ అంచనాలను మించిన పురో గతి ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. దశమ స్థానంలో గురువుతో కుజుడు కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బులివ్వడం, తీసుకోవడం వంటి వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపా రాల్లో మీ నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదిత్య హృదయం పఠనం వల్ల వ్యవహార జయం ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్న గురువుతో కలిసి ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఊపందుకుంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడ డం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొద్దిగా శారీరక, మానసిక ఒత్తిడికి అవ కాశం ఉంది. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారకపోవడం మంచిది. ఊహించని ధన యోగం పడుతుంది. శివార్చన చేయించడం వల్ల అనుకూలతలు పెరుగుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువుతో పాటు, శుక్ర, బుధ, రవులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల శుభ వార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, కుటుంబ జీవితంలోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారు లకు కొత్త అవకాశాలు అందివస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలపడతాయి. ధనపరంగా అదృష్టం కలిసి వస్తుంది. తరచూ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చాలా మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
సప్తమ స్థానంలో కుజ, గురువులు, దశమ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల వారం రోజుల పాటు జీవితం చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అనేక విధాలుగా ధనాదాయం పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు లభించి ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల వివాదాలు తగ్గుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్ది శ్రమతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్లో ఒకటి రెండు పరిష్కారమవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు లాభిస్తాయి. ఇంటా బయటా శారీరక, మానసిక ఒత్తిడి ఉంటుంది. విశ్రాంతి తక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. కొందరు బంధువుల వల్ల చికాకులుంటాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య భంగమేమీ ఉండదు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. లలితా సహస్ర నామం పఠించడం వల్ల ఆశించిన విజయాలు కలుగుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువుతో పాటు, కుజుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. పిల్లలు చదువుల్లో పైకి వస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆశించినస్థాయిలో సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆస్తి సమస్య అనుకూలంగా పరిష్కారమవుతుంది. మిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. సుందరకాండ పారాయణం చేయడం మంచిది.
Also read
- మద్యం రవాణా కుంభకోణం- కారుమూరి సునీలే ప్రధాన సూత్రధారి!
- వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థి ఇంట్లో తెలంగాణ మద్యం – ఇద్దరు అరెస్ట్
- రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ – ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు
- రాజంపేటలో తీవ్ర ఉద్రిక్తత – ఎమ్మెల్యే ఆకేపాటి ఇంటిపై దాడి
- ఆదివారం దుర్గాష్టమి వేళ అరుదైన యోగం.. ఈ రాశులకు బంపర్ జాక్ పాట్ తో పాటు ఉద్యోగంలో ప్రమోషన్.!.
- Hyderabad: హైదరాబాద్లో ఘోరం.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను ఆటోలో తీసుకెళ్లి.!.
- సరళ మైసమ్మ ఆలయంలో హక్కుల రచ్చ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు..!
- పులివెందుల : పులివెందులలో హైటెన్షన్.. ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు.. నామినేషన్లపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ..
- Navratri: చండ, ముండలను చాముండేశ్వరి దేవి ఎందుకు సంహరించింది? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఇదే!
- Navratri: నవరాత్రుల్లో కన్యా పూజ ఎందుకు చేస్తారు? 9 మంది బాలికలను పూజించడం వెనుక ఉన్న రహస్యం ఇదే!






