Navratri lucky zodiac sings: దుర్గదేవీ నవరాత్రులలో శుక్రవారం రోజున మూల నక్షత్రం రావడంతో ద్వాదశ రాశుల్లో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా ధనలాభాలు కల్గుతాయి. ముఖ్యంగా చాలా ఏళ్ల తర్వాత అరుదైన పారిజాత యోగం కూడా ఇదే రోజున ఏర్పడబోతుంది.
Durga Navratri moola nakshatra yog lucky zodiac signs: దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు విశేషంగా వివిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో నవరాత్రుల్లో చాలా మంది ఉపవాసాలు ఉంటూ, ఆ కనకదుర్గమ్మ తల్లిని భక్తి శ్రద్దలతో ధ్యానిస్తుంటారు.ఈ క్రమంలో నవరాత్రుల్లో ఆరోరోజున అంటే 16వ తేదీన శుక్రవారం రోజును మూల నక్షత్రం వస్తుంది. అంటే ఈ రోజున అమ్మవారు సరస్వతి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఇదే రోజున అత్యంత అరుదైన పారిజాత యోగం కూడా ఏర్పడబోతుంది. శుక్రుడు, బుధుడు, శని గ్రహలు మిథున రాశిలో సంయోగం చెందడం వల్ల పారిజాతయోగం సంభవిస్తుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉండబొతుంది. అంతే కాకుండా కొన్ని రాశులకు ఊహించని ధనలాభాలు కూడా కల్గుతాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మిథునం.. ఈ రాశి వారికి నవరాత్రుల్లో మూల నక్షత్రం ప్రభావం వల్ల ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. కోర్టు కేసుల్లో విజయాలను సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాదనుకున్న డబ్బులు తిరిగి లభిస్తాయి. మీ వల్ల స్నేహితులు, బంధువులు లాభపడతారు.
కర్కాటకం.. ఈరాశుల వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. కీర్తి, ప్రతిష్టలుపెరుగుతాయి. కోరుకున్న అమ్మాయితో వివాహ యోగం కల్గుతుంది. రాజకీయాల్లో రాణిస్తారు. పేరు, ప్రఖ్యాదులు గడిస్తారు.
కన్యా రాశి.. ఈ రాశుల వారు విదేశీయానాలు చేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సోదరులతో,బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు సమసిపోతాయి. సంఘంలో గౌరవ మర్యాదాలు లభిస్తారు. లాటరీలు, భారీగా ధనలాభం లభ్యమయ్యే అవకాశం కన్పిస్తుంది.
తుల రాశి.. ఈ రాశుల వారికి విదేశీయానం చేస్తారు. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. ముఖ్యంగా పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం సూచనలు కన్పిస్తున్నాయి.ఉద్యోగాల్లో ప్రమోసన్లు, మెరుగైన అవకాశాలు మీ సొంతమౌతాయి.ఈ నవరాత్రుల నుంచి ఈ రాశుల వారికి అత్యంత శుభసమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
