మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కుమారుడు కారుమూరి సునీల్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ, నిర్ణయాలు, ఇతర కీలక అంశాలపై అతడి నుంచి వివరాలు సేకరించనున్నారు.
AP Liquor Transportation Scam : ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే రెండు రోజుల కస్టడీలో భాగంగా కారుమూరి సునీల్‌ను ఇవాళ హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు ఆరా తీస్తున్నారు. టెండర్ల నిర్ణయాలు, ఇతర కీలక అంశాలపై వివరాలు సేకరించనున్నారు. రేపు కూడా అతడిని విచారించనున్నారు.
అసలేం జరిగిదంటే : లిక్కర్ స్కాంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైఎస్సార్సీపీ ముఠా మద్యం రవాణా కాంట్రాక్టులో కూడా దోపిడీకి తెగబడిందని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కుంభకోణంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ స్కాంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ కొన్ని నెలల కిందట ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఆర్) నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌కుమార్‌లు ప్రధాన లబ్ధిదారులు, కీలక సూత్రధారులని ఇప్పటికే ఈడీ, సిట్ గుర్తించాయి. రాజకీయ పలుకుబడి, మద్యం రవాణా కుంభకోణంలో భాగస్వాములైన ముఠా సభ్యులతో సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకుని సబ్ కాంట్రాక్టుల కేటాయింపును గుప్పిట్లో పెట్టుకున్నారని తేల్చాయి. తద్వారా భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారని నిర్ధారించాయి. కొల్లగొట్టిన సొత్తులో 11.95 కోట్లు సునీల్, ఆయన భార్య కీర్తి, మామ ప్రతాప్‌రెడ్డి, తల్లి కారుమూరి లక్ష్మీకిరణ్, సోదరి దీపిక, ఆమె మామ అచ్చప్ప రామ్మూర్తిల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆధారాలు సేకరించాయి.
ఇప్పటి వరకూ చేపట్టిన దర్యాప్తులో రూ.18.9 కోట్ల సొత్తు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించాయి. ఇందుకోసం సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే ముసుగు సంస్థను తెరపైకి తీసుకొచ్చి సిగ్మా లాజిస్టిక్స్‌తో ఒప్పందం కుదిర్చుకున్నారని స్పష్టమైంది. తద్వారా కొల్లగొట్టిన సొత్తులో 85 శాతం మేర ఆయన కుమారుడు సునీల్, కోడలు కీర్తి ఖాతాల్లోకి నేరుగా చేరిందని నిర్ధారణైంది. ఈ అంశాలపై సిట్ గుట్టువిప్పనుంది.
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్‌ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



