కర్నూలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. అన్నదమ్ముల మధ్య చిన్న విషయంలో మొదలైన గొడవ ఏకంగా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లి.. క్షణికావేశంతో ఇంట్లో ఉన్న కొడవలిలో అతికిరాతంగా గొంతుకోసి మరీ అన్నను హత్య చేశాడు తమ్ముడు. సమాచరంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తాను వదిలేసిన భార్యను పెళ్లి చేసుకున్నాడనే విషంలో అన్న తమ్ముడితో గొడవ పడగా.. కొడవలితో తమ్ముడు అతి దారుణంగా అన్నను హత్య చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బిలకల గూడూరు గ్రామానికి చెందిన చెంచు తోట సుంకన్న, గొలుసన్న అనే ఇద్దరూ అన్నదమ్ములూ.. అయితే సుంకన్న గతంలో చోరీలకు పాల్పడుతూ జీవనం సాగించేవాడు.. దీంతో అతపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు సుంకన్న తన స్వగ్రామమైన బిలకల గూడూరును వదిలి.. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లికి షిఫ్ట్ అయ్యాడు.
దీంతో సుంకన్న ఆచూకీ కోసం పోలీసులు తరచూ అతని తమ్ముడైన గొలుసన్న ఇంటి వచ్చేవారు. అతని సమాచారం చెప్పాలని గొలుసన్నను అడిగేవారు. అయితే ఇలా తరచూ పోలీసులు తమ ఇంటికి రావడంతో విసిగిపోయిన గొలుసన్న ఈ నెల 10వ తేదీ సాయంత్రం సుంకన్నను ఊరికి పిలిపించి ఈ విషయాన్ని నిలదీశాడు. పోలీసులు ఇంటికి రావడం వల్ల నా పరువు పోతుందని అన్నతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
దానికి తోడు సుంకన్న తన మొదటి భార్యను వదిలిపెట్టగా ఆమెను గొలుసన్న పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో కూడా ఇరువురి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ అన్నింటిని మనసులో పెట్టుకుని తమ్ముడు తన అన్నను అదే రోజు రాత్రి ఇంటి వద్ద కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముసునూరు క్రాస్ రోడ్డు వద్ద గొలుసున్నను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ కిరణ్ కుమార్ తెలిపారు.
Also read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





