తెలంగాణ: నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసేందుకు ఓ ఆటో డ్రైవర్ యత్నించిన ఘటన కలకలం రేపింది. తమను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన బాలికలు.. నడుస్తున్న ఆటోలో నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది.
వివరాల్లోకి వెళ్తే.. శాలిగౌరారం మండలం ఊట్కూరుకు వెళ్లేందుకు ఇద్దరు బాలికలు నకిరేకల్లో ఆటో ఎక్కారు. వారిని ఊట్కూరుకు తీసుకెళ్తానని నమ్మించిన డ్రైవర్.. అటువైపు వెళ్లకుండా కేతేపల్లి మండలం ఇనుపాముల గుట్ట వైపు ఆటోను మళ్లించాడు. ఈ క్రమంలో మరో వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాడు.
ఫోన్లో ఆటో డ్రైవర్ మాట్లాడిన మాటలు విన్న బాలికలు అప్రమత్తమయ్యారు. ఇద్దరు అమ్మాయిలు దొరికారని, ఇనుపాముల గుట్ట వద్దకు రావాలని అతడు మరో వ్యక్తికి చెప్పినట్లు సమాచారం. దీంతో తమను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భయపడిన బాలికలు.. కదులుతున్న ఆటోలో నుంచి రోడ్డుపైకి దూకారు. ఈ ఘటనలో ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.
బాలికలు రోడ్డుపై పడిపోవడాన్ని గమనించిన వాహనదారులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. ఆటో డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలికల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- చాక్లెట్ చూపించి ట్రాప్.. పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే.. సంచలన నిజాలు..
- దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు! ఎక్కడంటే..
- ఆ శాఖల ఉద్యోగులే టార్గెట్.. ఫోన్ చేసి మాట్లాడుతారు.. ఆ తర్వాతే అసలు కథ మొదలైద్ది..
- ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?
- Telangana: కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్.. ఏం జరిగిందో తెలిస్తే..





