SGSTV NEWS online
Crime

బేగంపేట్‌ లో నకిలీ ఎయిర్‌ ఫోర్స్ అధికారి హల్ చల్.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు..


బేగంపేట్‌ లో నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారి హల్ చల్ చేశాడు. ఏకంగా ఫ్లయింగ్ ఆఫీసర్ డ్రెస్‌ వేసుకుని బేగంపేట్ పరేడ్ గ్రౌండ్‌ లోకి ప్రవేశించాడు నిందితుడు. అక్కడ ఫొటోలు దిగుతూ సంచరించాడు. అయితే అనుమానాస్పదంగా వ్యవహరించడంతో మిలిటరీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నకిలీ ఎయిర్‌ ఫోర్స్ అధికారిగా గుర్తించినట్లు సమాచారం అందుతోంది. ఇక పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌ కు చెందిన నితీష్ కుమార్ పాల్ ప్రస్తుతం నేరెడ్‌ మెట్‌ లో నివాసం ఉంటున్నాడు. బిహార్ నుంచి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన నితీష్ ఇక్కడే డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే మాయ మాటలతో తాను ఎయిర్‌ ఫోర్స్ అధికారినంటూ అందరినీ నమ్మించాడు.

సామాజిక మాధ్యమం అయిన ఇన్‌ స్టాగ్రామ్‌ లోనూ ఓ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అలా అందరూ తాను ఎయిర్‌ ఫోర్స్ అధికారినని నమ్మించాడు. అదే పేరుతో యువతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు బేగంపేట్ పరేడ్ గ్రౌండ్‌ కు వచ్చి ఇక్కడ ఫొటోలు దిగి వాటిని ఇన్ స్టాలో అప్ లోడ్ చేసి తద్వారా తాను ఎయిర్‌ ఫోర్స్ అధికారినని యువతులకు వల వేసే ప్రయత్నం చేశాడు.

కానీ అతడిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ మేరకు బేగంపేట్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నిందితుడు ఎయిర్ ఫోర్స్ అధికారిగా ఎప్పటి నుంచి కొనసాగుతున్నాడు..? ఎవరెవరిని మోసం చేశాడు..? అనే కోణాల్లో విచారణ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ నకిలీ ఆఫీసర్ వెనుక ఏమైనా గ్యాంగ్ ఉందా..? అనే కోణంలోనూ పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Also read

Related posts