మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య కాపురానికి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చింతల వెంకటేష్ కు ఆరు సంవత్సరాల క్రితం సిద్దిపేట జిల్లా చిల్లసారం (క్షీరసాగర్) గ్రామానికి చెందిన మౌనికతో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ కలహాల కారణంగా సుమారు రెండేళ్ల క్రితం మౌనిక తన పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆమె తిరిగి భర్త వద్దకు రాకపోవడంతో వెంకటేష్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 30న ఇంటి సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకటేష్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి బయటకు వెళ్లి చూడగా..చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆర్‌పీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వెంకటేష్ మంగళవారం రాత్రి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
కుటుంబ సమస్యలు, ఒత్తిడి లేదా వ్యక్తిగత కష్టాల కారణంగా ఎవరైనా తీవ్రంగా బాధపడుతున్నట్లయితే వారిని ఒంటరిగా వదిలేయకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు వెంటనే అండగా నిలవడం చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అత్యవసర సేవలను సంప్రదించాలని పోలీసులు, మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.
Also read
- బేగంపేట్ లో నకిలీ ఎయిర్ ఫోర్స్ అధికారి హల్ చల్.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు..
- భార్యను కాపురానికి పంపకపోతే మనవరాలి మార్ఫ్ద్ న్యూడ్ ఫోటోలు వైరల్.. అత్తను బెదిరించిన అల్లుడు!
- Srikakulam: అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన మహిళ.. ఏం చేసిందో తెలిస్తే షాకే..
- కాపురానికి రాని భార్య.. తీవ్ర మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య.. మనోహరాబాద్‌లో విషాదం!
- సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో ఏం జరిగిందంటే..?





