రాజమహేంద్రవరం : సీసీ కెమెరాలు బిగిస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని రాజవోలులో చోటు చేసుకుంది. మృతులను అదే గ్రామానికి చెందిన సూర్యారావు (50), నేతాజీ నగర్ బొమ్మూరుకు చెందిన కాంట్రాక్టర్ చిన్న కృష్ణారెడ్డి (55)గా గుర్తించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఇనుప స్టాండ్‌ను తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
Also read
- విశాఖ: పాక్ హనీ ట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్
- పెళ్లి అయినా పాత బంధాన్ని వదల్లేక కిరాతకం
- ప్లీజ్.. లిఫ్ట్ కావాలంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బండి ఆపాడు.. ఆ తర్వాత 2 గంటలపాటు..
- సీసీ కెమెరాలు బిగిస్తూ ఇద్దరి మృతి
- ఆయేషా వెళ్లిన స్కూటీ ఎవరిది?





