సీలేరు: తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు కురిసి రహదారులు తెగిపోవడంతో ఆస్పత్రికి వెళ్లే దారిలేక అల్లూరి జిల్లాలో బాలింత మృతిచెందింది. గూడెంకొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని గంగవరం గ్రామంలో పాంగి సన్యాసిరావు భార్య లావణ్య (28) మగబిడ్డకు జన్మనిచ్చి మరణించింది. నిండుగర్భిణి అయిన ఆమె వాయుగుండం ప్రభావానికి ముందు అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు దారకొండ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు.
ఇదిలా ఉండగా భారీ వర్షాలకు గంగవరం గ్రామానికి సమీపంలోని ఒడిశా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన నాలుగురోజుల కిందట కొట్టుకుపోయింది. గ్రామానికి అవతల ఉన్న మరో చిన్న వంతెన కూడా తెగిపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గురువారం సాయంత్రం లావణ్యకు ఇంటివద్ద ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆమెను ఎలాగైనా ఆస్పత్రికి తరలించాలని గంటల తరబడి ప్రయత్నించారు.
గ్రామానికి రెండు వైపులా వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాధ్యం కాలేదు. ఈలోగా ఇంటివద్దే లావణ్య మగశిశువుకు జన్మనిచ్చి కోమాలోకి వెళ్లి మృతిచెందింది. దారకొండ ఆస్పత్రి సిబ్బంది వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులకు సమాచారం అందించారు. వర్షాలతో రహదారులు తెగిపోయి అత్యవసర సమయంలో ఆస్పత్రికి తరలించలేకపోవడంతో లావణ్య ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
Also read
- ATM Robbery: నగరంలో భారీ చోరీ.. ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
- Hyderabad: సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్!
- Hyderabad: షేక్‌పేట లేడీస్ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- ఆలయాన్నే టార్గెట్ చేసిన కేటుగాడు… ఒకే గుడిలో వరుస చోరీలతో స్థానికుల ఆందోళన!
- ఏపీలో పాక్ గూఢచారి నెట్వర్క్.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్.. నేవీ సిబ్బందితో సహా 18 మంది అరెస్ట్!





