Hyderabad: దంపతుల మధ్య చిన్ని చిన్న గొడవలు
ఎన్నెనా ఉండవచ్చు. అది అప్పటికే.. మళ్లీ మరిచిపోతారు. గొడవలు లేని కాపురం ఎక్కడా ఉండదు. కానీ ఉద్యోగం లేదన్న కారణంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మరో విషయం ఏంటంటే మృతురాలికి ఆరేళ్లు కొడుకు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ సిటీలో వెలుగుచూసింది.
కుషాయిగూడ పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. స్వాతి మహాజన్- గోపాలకృష్ణ తులసీదాస్కు దశాబ్దం కింద వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరేళ్లు స్వరూప్ అనే కొడుకు ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు యూకేలో ఉద్యోగం చేశారు. రెండేళ్ల కిందట తిరిగొచ్చి కాప్రాలోని మ్యాపిల్ హోమ్ మారుతి బూబ్లీ ఎంక్లేవ్లో నివాసం ఉంటున్నారు. ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత గోపాలకృష్ణకు ఉద్యోగం వచ్చింది.
స్వాతి ఇంకా ఉద్యోగం ప్రయత్నాలు చేసింది.. చేస్తోంది కూడా. ఉద్యోగం దొరకపోవడంతో ఇంటి వద్ద ఉండేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ బాధ నుంచి బయట పడలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సెప్టెంబర్ 30న అనగా బుధవారం పక్కింటి వ్యక్తి మధ్యాహ్నం స్కూల్ నుంచి స్వరూప్ను ఇంటికి తీసుకొచ్చాడు.
ఇంటి డోర్ కొట్టినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో సదరు వ్యక్తి గోపాలకృష్ణకు, అటు పోలీసులకు కూడా సమచారం ఇచ్చాడు. ఇంటికి చేరుకున్న గోపాలకృష్ణ, తలుపులు బద్దలుగొట్టి లోనికి వెళ్లి చూశాడు. అప్పటికే భార్య స్వాతి మహాజన్ సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- విదేశీ యువతులతో వల.. హైదరాబాద్లో హైటెక్ దందా..! కథ మామూలుగా లేదుగా..
- నర్సింగ్ విద్యార్థిని హత్య కేసులో సంచలన ట్విస్ట్.. చంపిందెవరో తెలిసి షాక్!
- పగలు తండ్రి దగ్గర.. రాత్రి తల్లి దగ్గర.. చివరకు నీటి కుంటలో శవమై కనిపించిన ప్రభు కిరణ్..
- రూ.20 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు.. అయినా ఆశ తీరలేదు.. అయ్యో కవిత..
- నగల కోసం నానమ్మను హత్య చేసిన మనుమడు.. ఈఎంఐల కోసం దారుణం!





