SGSTV NEWS online
Andhra PradeshCrime

మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్.. తోటలో గోనె సంచిలో ప్రత్యక్షం!





జిల్లాలోని పుసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామంలో 34 ఏళ్ల వివాహిత హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో జరిగిన వాగ్వాదం అనంతరం ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని తోటల్లో పడేసినట్లు పేర్కొన్నారు. మహిళ భర్త ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు..



విజయనగరం, సెప్టెంబర్‌ 17: పుసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామంలో 34 ఏళ్ల వివాహిత అనుమానాస్పద మృతి కేసు హత్యగా తేలింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన వాగ్వాదం అనంతరం ఆమెను ప్రియుడు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, గ్రామానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని తోటల్లో పడేసినట్లు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..


నడిపల్లి గ్రామానికి చెందిన ఎస్. రమ (34)కు భర్త, 10 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబుతో ఆమెకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం బంగారుబాబు తన ఇంటికి రావాలని రమ కోరింది. అతను వచ్చిన తర్వాత అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బంగారుబాబు దిండుతో ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి కుడిపి–సారిపల్లి గ్రామాల మధ్య ఉన్న తోటల్లో పడేశాడు.


రమ కనిపించకపోవడంతో ఆమె భర్త శీల అప్పారావు పుసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి రావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. భోగాపురం రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సాగిన దర్యాప్తులో రమను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం తోటలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బంగారుబాబును పుసపాటిరేగ మండలం పోరం గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పుసపాటిరేగ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also read

Related posts