విశాఖపట్నం: వివాహేతర సంబంధంలో వివాదాల కారణంగామనస్తాపానికి గురై ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలు.. మధురవాడ ఆర్టీసీ కాలనీలోని సాయిప్రియ నివాస్ ఎఫ్-2లో పిట్ల కోమలి(29) మూడు నెలలుగా సుభాన్ అనే వ్యక్తితో కలిసి ఉంటోంది. ఈ నెల 13న సుభాన్ భార్య, ఆమె సోదరుడు కోమలిని వాంబే కాలనీకి పిలిపించి సుభాన్ తో ఉన్న సంబంధంపై నిలదీసినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని సుభాన్కు కోమలి ఫోన్లో చెప్పినప్పటికీ అతని నుంచి స్పందన లేదు. దీంతో మనస్తాపానికి గురైన కోమలి అదే రోజు రాత్రి ఇంటి కిటికీ ఊచలకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి సోదరి బి.భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎం పాలెం సీఐ జి.భాస్కరరావు తెలిపారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?
- మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్.. తోటలో గోనె సంచిలో ప్రత్యక్షం!
- రాడ్డుతో చితకబాది.. యాసిడ్ పోసి.. ప్రియుడిని దారుణంగా హతమార్చిన ప్రియురాలు!





