SGSTV NEWS online
Andhra PradeshCrime

దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..



అమ్మమ్మను అమ్మ, బాబాయ్ కలిసి చంపేశారు.. బాబాయ్ కాళ్లు పట్టుకుంటే, అమ్మ చీరతో మెడ బిగించేసింది.. కళ్లెదుటే జరిగిన ఘోరాన్ని ఓ పసివాడు చెబుతుంటే విన్నవారి గుండె తరుక్కుపోతోంది. వివాహేతర బంధం నెత్తికెక్కిన ఓ కూతురు, తప్పును సరిదిద్దబోయిన కన్నతల్లినే కడతేర్చిన దారుణం గుంటూరు జిల్లా పొన్నూరులో తీవ్ర కలకలం రేపింది.



ప్రేమ గుడ్డిదంటారు.. కానీ ఇక్కడ ఆ గుడ్డితనం కన్నపేగును తెంచేసే స్థాయికి దిగజారింది. తమ వ్యవహారానికి అడ్డుపడుతోందన్న అక్కసుతో, సొంత తల్లినే కడతేర్చిన ఓ కసాయి కూతురి ఉదంతం గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో తీవ్ర కలకలం రేపుతుంది. క్యాబిన్‌పేట పరిధి 8వ వార్డులో ఈవూరు లక్ష్మి తన కూతురు పుష్పలతతో కలిసి నివాసం ఉంటుంది. పుష్పలతకు గతంలోనే పెళ్లవగా.. భర్త మరణించాడు. ఈ క్రమంలో కొడుకుతో కలిసి తల్లి దగ్గరే ఉంటుంది. అయితే రాజా అనే వ్యక్తితో ఆమె పెట్టుకున్న వివాహేతరం సంబంధం కుటుంబంలో చిచ్చు పెట్టింది. సమాజంలో పరువు పోతుందని, ఆ బంధం వద్దని లక్ష్మి పదే పదే వారిస్తూ వచ్చింది. ఈ క్రమంలో తల్లీకూతుళ్ల మధ్య మాటామాటా పెరిగి నిత్యం గొడవలు జరుగినట్లు సమాచారం. ఈ క్రమంలో తమ బంధానికి లక్ష్మి పెద్ద అడ్డంకిగా మారిందని భావించిన పుష్పలత – రాజా ఆ జంట ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకుంది.


ఎలా చంపారంటే..?
శుక్రవారం రాత్రి ఇంట్లోనే లక్ష్మి అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడి ఉంది. అయితే బంధువులకు కూతురు ఎక్కడా కన్పించలేదు. ఆ రాత్రి ఏం జరిగిందో పుష్పలత కొడుకు పూసగుచ్చినట్లు చెప్పాడు. ‘‘అమ్మమ్మను అమ్మ, బాబాయ్ కలిసి చంపేశారు. బాబయ్ కాళ్లు పట్టుకుంటే అమ్మ.. అమ్మమ్మ మెడకు చీరలు చుట్టి ఊపిరాడకుండా చేసింది. ఆ తర్వాత బంగారం, డబ్బు తీసుకుని పారిపోయారు’’ అని బాలుడు చెప్పాడు. దీంతో బంధువులంతా ఒక్కసారిగా షాకయ్యారు.


పోలీసుల వేట.. విచారణ ముమ్మరం సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రస్తుతం పుష్పలతతో పాటు ఆమె ప్రియుడు రాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కన్నతల్లి శవాన్ని చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతుంటే, కసాయి కూతురి తీరుపై జనం నిప్పులు చెరుగుతున్నారు.

Also read

Related posts