మచిలీపట్నం
6/09/2026
ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, గొర్రెపాటి గోపీచంద్ అన్నారు…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్,
గొర్రె పాటి గోపీచంద్ ఆదివారం మచిలీపట్నం సిడింబి అగ్రహారంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు……
మూడు దశాబ్దాల తరువాత వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కరువు ప్రాంతాలకు జలాలు అందించిన ఘనత చంద్రబాబు దే అన్నారు.
టెక్నాలజీతో జల వనరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చక్కటి భవిష్యత్తు బాటలు వేస్తున్నారు అన్నారు.
గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర ఆయకట్టుకు జీవం పోశారు అన్నారు.
కరువు నేలపై జలసిరులు పారించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు మన చంద్రబాబు అన్నారు.
30 ఏళ్ల కల వెలిగొండ ప్రాజెక్టు సాకారం ద్వారా కరువు నేలకు కృష్ణమ్మ జలాలు అందడం ద్వారా మార్కాపురం ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారం అయింది అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ తో
నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని కృష్ణానది పరివాహక ప్రాంతానికి తరలించడంలో పోలవరం ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు.
వైసిపి పాలకుల నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు
పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు ద్వారా మన రాష్ట్రానికి సాగునీరు, తాగునీరు, విద్యుత్ మరియు నీటి నిర్వహణకు అత్యంత కీలకమైన ప్రాజెక్టులో ఒకటి మన పోలవరం ప్రాజెక్టు అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి చేతకాని గత వైసీపీ పాలకులు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాలు కాలం గడిపి, ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని వైసీపీ నేతలు కళ్ళుండి చూడలేక విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు.
గత వైసిపి
పాలకులు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యంతో చూడడం వల్ల ప్రాజెక్టు పనులు ఎంత మాత్రం పట్టించుకోకుండా గత వైసిపి పాలకులు
నిర్లక్ష్యం చేయడం వల్ల
ఇప్పుడున్న ఎలినోవో ప్రభావంతో వ్యవసాయానికి నీటి కష్టాలు వచ్చాయి అన్నారు. అయినా కూడా చంద్రబాబు విజన్ తో రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు నీటి కష్టాలు రాకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చూస్తోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్, నిమ్మగడ్డ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





