వార ఫలాలు (సెప్టెంబర్ 6-12, 2026): మేష రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఈ వారం అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో ఉత్తమ ఫలితాలు గడిస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఈ రాశికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు చురుకుగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవ కాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఈ రాశికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా దాదాపు అన్ని రంగాల వారు శుభఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. సోదరుల మీద విజయాలు సాధిస్తారు. సమాజంలో పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. విద్యా ర్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. రావలసిన ధనం చేతికి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక విషయాలకు, లావాదేవీలకు సమయం అనేక విధాలుగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేప ట్టినా ఆశించిన ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయ త్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయా నికి లోటుండకపోవచ్చు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఈ రాశివారికి ఈ వారం కొద్దిపాటి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి డబ్బు ఖర్చయిపోతుంది. ఇతరు లకు సహాయం చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వ్యాపారపరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. పిల్లల చదువులు, ఉద్యో గాలు నెమ్మదిగా పురోగతి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ వాతా వరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో పెద్దల సలహాలు కూడా తీసుకోవలసిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. అయితే, వృథా ఖర్చుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా విశ్రాంతి లోపిస్తుంది. గతంలో మీ నుంచి బాగా ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. దీర్ఘకాలిక రుణాల విషయంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొం టారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహ కరంగా సాగుతుంది. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కొన్ని శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. పెండింగ్ పనులు, వ్యవహా రాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. పోటీదార్లమీద పైచేయి సాధిస్తారు. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఈ రాశివారికి ఈ వారమంతా చాలావరకు అనుకూలంగా సాగుతుంది. కొద్ది శ్రమతో ఆదాయ స్థితి బాగా మెరుగుపడుతుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ రాబడి ఉంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరి ష్కారమవుతాయి. కుటుంబంలో శుభ కార్యానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల దాదాపు అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విష యంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి జాగ్రత్తగా బయట పడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరు గుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఈ వారం ఆదాయ వ్యయాలు సమపాళ్లలో సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, ఒక పట్టాన చేతిలో డబ్బు నిలవదు. వారాంతంలో మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చాలా వరకు సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం తలెత్తే అవకాశం ఉంది. బంధువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వా మితో ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభ వార్తలు ఎక్కువగా వింటారు. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదర వర్గంతో ఆస్తి వివాదానికి సంబంధించి రాజీ మార్గం అనుసరిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పిల్లల చదువులకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
Also read
- Garuda Purana: మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?
- Weekly Horoscope: ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు ఇలా..
- అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు
- ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
- అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం
- సోషల్ మీడియా లో పరిచయం.. మాయమాటలతో వల
- చున్నీతో చేతులు కట్టేసి.. నోట్లో రుమాలు కుక్కి..
- ‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య పుట్టినరోజు నాడే హైదరాబాద్ టెకీ ఆత్మహత్య
- ప్రియురాలి బర్త్‌డే.. ఐఫోన్ సర్ప్రైజ్ ప్లాన్.. చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కైన లవర్స్..
- ప్రేమ పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. కట్‌చేస్తే.. ఆ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది..?










