ప్రియురాలి పుట్టినరోజుకు ఖరీదైన ఐఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్న యువకుడు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరా సమీపంలో ప్రియురాలితో కలిసి 12 కిలోల గంజాయిని తరలిస్తూ ఈగల్ బృందాలు, వైరా పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చిన గంజాయి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గతంలోనూ గంజాయి కేసుల్లో అరెస్టైన అతడు.. ఐఫోన్ కోసం మరోసారి ఇదే దందాకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో యువకుడి తీరు చూసి పోలీసులే షాక్ అయ్యారు. గర్ల్‌ఫ్రెండ్‌కి ఐఫోన్ కొనిచ్చేందుకు ఏకంగా.. ఆమెతో కలిసి గంజాయి పెడ్లర్ అవతారం ఎత్తాడు.. ప్రియురాలికి బర్త్ డే సందర్భంగా సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ప్రియురాలికి బర్త్ డే సందర్భంగా ఐఫోన్ గిఫ్టుగా ఇవ్వాలనుకున్న ఓ యువకుడు ఆమెతో కలిసి గంజాయి రవాణాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఖమ్మం జిల్లా వైరా సమీపంలో పోలీసులు, ఈగల్ బృందాలు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాకు చెందిన చైతన్య (21) హేమలత (20) ప్రేమికులు.. అయితే.. త్వరలో హేమలత పుట్టినరోజు వస్తుండడంతో ఆమెకు కొత్త ఐఫోన్ బహుమతిగా ఇస్తానని మాటఇచ్చాడు.. అందుకోసం చైతన్య డ్రగ్ పెడ్లర్ అవతారమెత్తాడు. గతంలోనూ గంజాయి రవాణా కేసుల్లో మూడుసార్లు అతను అరెస్టు అయ్యాడని పోలీసులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన చైతన్యకు గంజాయి కావాలంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తులు ఆర్డర్ ఇచ్చారు.. వారికి కావాల్సిన గంజాయిని ఒడిశా నుంచి తెచ్చిస్తానని వారితో ఒప్పందం చేసుకున్నాడు. హేమలతతో కలిసి పల్సర్ బైకుపై ఒడిస్సాకు వెళ్ళాడు. స్థానికుడైన భగవాన్ నుంచి 12 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అనంతరం గంజాయిని తీసుకొని వీరిద్దరూ బైక్ పై ఖమ్మం జిల్లాలోకి వస్తుండగా వైరా వద్ద ఈగల్, వైరా పోలీసులు అడ్డుకున్నాయి.
పోలీసులు వాహనాలు ఆపటానికి ప్రయత్నించడంతో చైతన్య పోలీసుల పైకి బైక్ ఎక్కించి పారిపోయే ప్రయత్నం చేశారు. వీరి వద్ద నుంచి ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గతంలో చైతన్యపై నాలుగు గంజాయి కేసులు ఉన్నాయని.. జైలుకు వెళ్లొచ్చాడని పోలీసులు తెలిపారు. అయినా అతని ప్రవర్తన లో మార్పు రాలేదని తెలిపారు. ప్రియురాలు కి ఖరీదైన ఐ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలనే ఆలోచనతో.. గంజాయి అక్రమ రవాణా మార్గాన్ని ఎంచుకొని ఇద్దరూ కటకటాల పాలయ్యారు.
Also read
- ‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య పుట్టినరోజు నాడే హైదరాబాద్ టెకీ ఆత్మహత్య
- ప్రియురాలి బర్త్‌డే.. ఐఫోన్ సర్ప్రైజ్ ప్లాన్.. చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కైన లవర్స్..
- ప్రేమ పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. కట్‌చేస్తే.. ఆ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది..?
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





