SGSTV NEWS online
Astro TipsAstrology

కేతువు అనుగ్రహంతో ఒక్కసారిగా మారిన వారి జాతకం..! ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో శుభాలు



Ketu Blessings: ఆగస్టు 17 నుంచి కేతువుతో రవి, ఆగస్టు 22 నుంచి బుధుడు కలవడం వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, విదేశీ అవకాశాల్లో ఊహించని మార్పులు, పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయి.సెప్టెంబర్ ద్వితీయార్థం వరకు ఆకస్మిక శుభ పరిణామాలు కొనసాగే అవకాశముంది.

చాలా కాలంగా ఒంటరి సంచారం చేస్తున్న కేతువుతో ఈ నెల(ఆగస్టు) 17 నుంచి నెల రోజుల పాటు రవి, 22 నుంచి బుధుడు కలుస్తున్నందువల్ల ఈ పాప గ్రహం శుభగ్రహంగా మారి శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక దుష్పరిణామాలను కలుగజేసే కేతువు కొన్నిరాశులకు సెప్టెంబర్ ద్వితీయార్థం వరకు ఆకస్మిక శుభ పరిణామాలను కలగజేయడం జరుగుతుంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి ఈ కేతువు వల్ల దశ, దిశ తిరిగే అవకాశం ఉంది. ఆర్థిక, ఉద్యోగ, వృత్తి, వ్యాపార, విదేశీయాన, ఆరోగ్య పరిస్థితుల్లో ఊహించని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి.

మేషం: ఈ రాశికి కేతువు పంచమ స్థానంలో సంచరించడం వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మనసు చంచలంగా ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం కేతువు రవి, బుధులతో కలవడం వల్ల స్థిరమైన ఆలోచనలు కలుగుతాయి. ఆశయాలు, లక్ష్యాల మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఉద్యోగంలో స్తబ్ధత తొలగిపోయి సమర్థత, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. మంచి గుర్తింపు లభి స్తుంది. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి.

మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో కేతువు సంచారం ఆత్మవిశ్వాసం, చొరవ, మనో ధైర్యం బాగా తగ్గడం, దేని మీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటివి జరుగుతాయి. ప్రస్తుతం కేతువులో మార్పు వల్ల ఈ ప్రతికూలతలు మటుమాయం అవుతాయి. అన్నివిషయాల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులే షన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుంది.

కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో కేతువు సంచారం ఆర్థిక పురోగతి నత్తనడక నడుస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లో పెరుగుదల ఉండదు. కేతువు పరిస్థితి ఆగస్టు 17 నుంచి మారుతున్నందువల్ల ఊహించనిని మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు , వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించే అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి లాభ స్థానంలో కేతు సంచారం వల్ల కష్టానికి తగ్గ ఫలితం ఉండకపోవచ్చు. ఆదాయం ఒక పట్టాన పెరగకపోవచ్చు. పదోన్నతులు కలగకపోవచ్చు. అయితే, కేతువు రవి, బుధులు కలు స్తున్నందువల్ల తప్పకుండా కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచరిస్తున్న కేతువు వల్ల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కాకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం చేజారిపోవచ్చు. అయితే, కేతువు శుభుడుగా మారడం వల్ల విదేశీ ప్రయత్నాలు క్రమంగా సక్సెస్ అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒకటికి రెండు సార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అంచనాల్ని మించుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

కుంభం: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి ఆశించిన విముక్తి లభించకపోవచ్చు. ఆదాయ వృద్ధికి మార్గాలు తగ్గుతాయి. అయితే, 17 తర్వాత నుంచి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. లాటరీలు, షేర్లు, స్పెక్యులే షన్ల వంటి వాటివల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి.. ఆస్తిల విలువ పెరుగుతుంది.

Related posts