SGSTV NEWS online
Andhra Pradesh

ఐ.యఫ్.టి.యు కార్యవర్గం ఏకగ్రీవం..


ఇఫ్టు  పట్టణ అధ్యక్షుడు గా రవ్వ సురేష్, ప్రధాన కార్యదర్శి గా మల్లిడి రామిరెడ్డి లుఎన్నిక….ఐ.యఫ్.టి.యు
       నిడదవోలు యర్నగూడెం రోడ్ లో కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం లో జరిగిన ఐ.యప్.టి.యు నిడదవోలు పట్టణ స్థాయి నిర్మాణ జనరల్ బాడీ సమావేశం. సమావేశానికి అధ్యక్షత వహించిన ఇఫ్టు నిడదవోలు ఏరియా కమిటీ అధ్యక్షులు పామర్తి సత్యనారాయణ.
        ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ , ఇఫ్టు జిల్లా కమిటీ సభ్యులు గెడ్డం రవీంద్ర లు మాట్లాడుతూ 2014 నుండి ఐ.యఫ్.టి.యు నిడదవోలు పరిసర  ప్రాంతాల్లో వివిధ రంగాల కార్మికుల ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తోందనీ, కనీస వేతనాలు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, వంటి వాటితో పాటు , గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల పెంపు, రోడ్ల దుస్థితి, వంటి ప్రజా సమస్యలపై కూడా పోరాడుతున్న నేపధ్యంలో పట్టణ నూతన కార్యవర్గం ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలన్నారు.
   ఎన్ని కైన నూతన కార్యవర్గం:
ప్రెసిడెంట్: రవ్వ సురేష్ కుమార్
వైస్ ప్రెసిడెంట్: కోనేటి మల్లేశ్వర రావు, కొమ్మోజు శేఖర్
ప్రధాన కార్యదర్శి: మల్లిడి రామిరెడ్డి
సహాయ కార్యదర్శి : కొండపల్లి నాగ శ్రీనివాసరావు, తీరిపోతాయి వీర్రాజు
కోశాధికారి: లంకాడ గణపతి
కార్యవర్గ సభ్యులు: ఆనంద్ , మందరపు సత్యనారాయణ, గాలి గనిరాజు, పులుగు చైతన్య తదితరులను సమావేశం ఏకగ్రీవంగా ఎన్ను కోవడమైనది.

Also read

Related posts