ఐ.యఫ్.టి.యు అనుబంధ ఆదర్శ ప్లాట్ ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మంత్రి కందుల దుర్గేష్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడమైనది.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ మంత్రి గారి దృష్టి కి ప్లాట్ ఫారం రిక్షా కార్మికుల అవస్థలు తీసుకు వస్తూ 4 దశాబ్దాలుగా ఎండనక, వాననక రోడ్డు పక్కన నిలబడి తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జీవనోపాధి పొందుతున్నాలనీ, గత ప్రభుత్వం లో పలుమార్లు అర్జీలు ఇచ్చి ధర్నాలు చేసినా తమ సమస్యకు పరిష్కారం కాలెదనీ, సమాజంలో అట్టడుగు శ్రామిక వర్గం ఐన రిక్షా కార్మికుల ఉపాధి కాపాడేందుకు పశువుల ఆసుపత్రి సమీపంలో కనీసం 10 రిక్షా లు నిలుపుకొనేవిధంగా రిక్షా స్టాండ్ ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
అందుకు మంత్రి దుర్గేష్ గారు సానుకూలంగా స్పందిస్తూ మున్సిపల్ కమీషనర్ గారితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం మైధిలి.
పై కార్యక్రమంలో ఐ.యఫ్.టి.యు నిడదవోలు ఏరియా కమిటీ అధ్యక్షులు పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టియు నిడదవోలుపట్టణ కార్యదర్శి మల్లిడి రామిరెడ్డి, ఆదర్శ ప్లాట్ ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వర రావు, ఇతర నాయకులు పిచ్చా సూర్య కిరణ్, లంకాడ గణపతి, నాగరాజు, నంగాలు, చొక్కాకుల సత్యనారాయణ, రమణ తదితరులు పాల్గొన్నారు.
