ఐఐటీ గువాహటిలో చదువుతున్న సాయి చేతనరెడ్డి
జమ్మలమడుగు : అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడిపోయి.. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుమార్తె సాయి చేతనరెడ్డి (20) మృతి చెందారు. ఆమె ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇటీవలి వర్షాలకు విద్యా సంస్థకు సమీపంలో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదికి భారీగా వరదొచ్చింది. ఆ ఉద్ధృతిని చూసేందుకు ఆమె శనివారం స్నేహితులతో కలిసి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడ్డారు. రెస్క్యూ బృందాలు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టి.. చేతనరెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. తహసీల్దార్ భార్య మంజుల పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కుమార్తె అకాల మరణంతో తండ్రి సాయినాథెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లె తీసుకురానున్నారు.
Also read
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..
- Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా





