జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వాస్తు నిపుణులు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇంటిలోకి పాము రావడం కూడా శుభ అశుభ ఫలితాలను ఇస్తుందంట. కాగా, అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం.
వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఇంటి చుట్టు పాములు తిరగడం, కొన్ని సార్లు ఇంటిలోకి పాములు రావడం జరుగుతుంది. అయితే ఇంటి వద్ద పదే పదే పాములు కనిపించడం కూడా వాస్తు దోషాన్ని చూపిస్తుందంట. కాగా, అసలు ఇంటి వద్ద పదే పదే పాములు కనిపించడం దేనికి సంకేతం. దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, ఇంటి వద్ద లేదా, ఇంటి పెరటిలో మీకు పదే పదే పాము కనిపించడం, అది మీకు ఎలాంటి హాని చేయకపోతే, అది మీ పూర్వీకుల ఆశీర్వాదం అని చెబుతున్నారు పండితులు. కుటుంబాన్ని రక్షించడానికి వారు పాముగా మారి, మీకు రక్షణగా ఉంటున్నారంట.
అలాగే వాస్తు ప్రకారం చూస్తే, ఇంటి ప్రధాన ద్వారం లేదా ఇంటి లోపల, ఇంటి వద్ద పదే పదే పాము కనిపించడం వాస్తు దోషాలను సూచిస్తుందంట. పదే పదే మీ ఇంటి వద్ద పాము కనిపిస్తుంది అంటే, అది వాస్తు దోషం, దీని వలన ఇంటిలోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుందంట. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంట.

అయితే కనిపించే పాము రంగును బట్టి కూడా దాని ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా తెల్ల పాము, అదృష్టానికి, పసుపు రంగు, ఆధ్యాత్మిక పురోగతి, నల్ల పాము, రాహు దోషాలను సూచిస్తుందని చెబుతున్నారు పండితులు.
