SGSTV NEWS online
Andhra PradeshCrime

విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోరుతూ తరగతుల బహిష్కరణ….పి.డి.యస్. యు


     దేశ వ్యాప్తంగా విద్యార్థుల సమ్మె పిలుపులో భాగంగా నిడదవోలు లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం (పి.డి.యస్.యు)  ఆధ్వర్యంలో నిడదవోలు లో పలు ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల విద్యార్థులు నేడు తరగతులు బహిష్కరించారు.
      కార్యక్రమంలో భాగంగా పి.డి.యస్.యు విద్యార్థుల బృందం పట్టణంలో ని డి.యస్.ఓ, మున్సిపల్ హైస్కూల్, గవర్నమెంట్ హైస్కూల్, బాయ్స్ జూనియర్ కళాశాల, యన్.టి.ఆర్ హైస్కూల్, యల్. యల్. ఆర్ మున్సిపల్ హైస్కూల్, సమిశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తదితరాల పాఠశాల లనందు ప్రచారం నిర్వహించి తరగతుల బహిష్కరణ చేయించడం మైనది.
      ఈ సందర్భంగా పి.డి. యస్. యు నాయకులు మల్లిపూడి సంపత్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్లు లీక్ కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో విద్యార్థులు శాంతి యుతంగా నిర్వహిస్తున్న ఆందోళన పై ప్రభుత్వ దమనకాండ కు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళన లో భాగం గా నిడదవోలు పరిసరాల్లో ని విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
      పై కార్యక్రమంలో పిండి యస్.యు నాయకులు బొల్లం హరి, ముప్పిడి బాలు, సంపత్, గంగుల తదితరులు నాయకత్వం వహించారు.

Also read

Related posts