తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి విధుల్లో ఉన్న స్వామి.. గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో కార్యాలయ ప్రాంగణంలోని వాష్‌రూమ్‌లోకి వెళ్లి .. తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించడంతో అక్కడి సిబ్బంది పరుగెత్తుకుంటూ వెళ్లగా, స్వామి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సంబంధిత సమస్యల కారణంగా స్వామి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలు ఏమిటన్న దానిపై స్పష్టత కోసం కుటుంబ సభ్యులు, సహచరులను విచారిస్తున్నారు.
దర్యాప్తు సందర్భంగా స్వామి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కుటుంబ సభ్యుల గురించి ఆయన రాసిన కొన్ని భావోద్వేగ వ్యాఖ్యలు లభించినట్లు తెలుస్తోంది. తన మరణానికి ఎవరినీ బాధ్యులుగా చూడొద్దని, భార్యా పిల్లలను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని కోరినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబంపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ, తాను లేకపోయినా వారిని ఎప్పుడూ కాపాడాలనే భావనను డైరీలో వ్యక్తం చేసినట్లు సమాచారం.
నేను ఈ లోకం నుంచి వెళ్లిపోయినా, చనిపోయిన తర్వాత దెయ్యంగా మారైనా నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆయన డైరీలో ఎంతో ఆవేదనతో రాశారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు సాంకేతిక ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు
Also read
- దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం.. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం!
- నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఏ నియమాలు పాటిస్తే శుభఫలితాలు లభిస్తాయి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- దెయ్యమై నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్ సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు!
- రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..





