రూ.3.50 కోట్లు వసూలు చేసిన దర్శక, నిర్మాతలు
హైదరాబాద్: సినిమాలో హీరో అవకాశం ఇస్తానని నమ్మించి ఓ యువకుడిని నిలువెల్లా మోసం చేశారు. ఈమేరకు దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మీలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఠాణాలో కేసు నమోదైంది. కూకట్పల్లికి చెందిన నాయుడు హనుమంతరావు కుమారుడికి సినిమాలంటే మక్కువ. దీన్ని అవకాశంగా మలుచుకున్న అశోక్, విజయలక్ష్మీలు సినిమా అవకాశం ఇస్తామని నమ్మించారు.
యువకుడి తల్లిదండ్రుల నుంచి పలు దఫాలుగా రూ.3.50 కోట్లు తీసుకున్నారు. అయితే అనుకోని కారణాలతో సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఇచ్చిన సొమ్ము వాపసు ఇవ్వాలంటూ బాధితులు దర్శకుడు అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మీలను సంప్రదించారు. దీంతో వాళ్లు డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో విసుగు చెందిన బాధితుడు హనుమంతరావు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్శకుడు అశోక్ బాబు తెలుగులో భాగమతి, పిల్ల జమిందార్, ఆకాశరామన్న వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Also read
- చాక్లెట్ చూపించి ట్రాప్.. పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే.. సంచలన నిజాలు..
- దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు! ఎక్కడంటే..
- ఆ శాఖల ఉద్యోగులే టార్గెట్.. ఫోన్ చేసి మాట్లాడుతారు.. ఆ తర్వాతే అసలు కథ మొదలైద్ది..
- ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?
- Telangana: కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్.. ఏం జరిగిందో తెలిస్తే..





