భార్యకు శాడిస్టు భర్త వేధింపులు
అనారోగ్యంతో నిరాకరించిన భార్య
మాట వినలేదని బంధువులతో కలిసి దాడి
తిరుపతి : కట్టుకున్న భర్తే బలవంతంగా వ్యభిచార
రొంపిలోకి దింపి సంవత్సరాలుగా పడుపువృత్తి చేయించాడని, ఇప్పుడు ఆ పనికి నిరాకరించడంతో విచక్షణారహితంగా దాడి చేశాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి రుణం తీరేవరకు వ్యభిచారం చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాడని కన్నీరుమున్నీరైంది. తనకు ప్రాణహాని ఉందని 112కు ఫోన్ చేసి పోలీసుల రక్షణ కోరింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలచేనులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బాధితురాలి కథనం ప్రకారం.. చింతలచేనుకు చెందిన దంపతులకు 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వివాహమైన తొలి రెండేళ్లు అత్తమామ సంపాదనతో కుటుంబ జీవితం సజావుగా సాగింది. అనంతరం భర్త బాధితురాలిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు. పదేళ్లుగా పడుపువృత్తి చేయిస్తున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురికావడంతో ఇకపై ఆ పని చేయలేనని బాధితురాలు స్పష్టం చేయడంతోపాటు పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో ఆగ్రహించిన భర్త, అతని బంధువులు బాధితురాలి కుటుంబంపై తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టడంతోపాటు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు 112కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఇంటి నిర్మాణానికి తీసుకున్న రూ.50 లక్షల రుణం తీరే వరకు తిరిగి వచ్చి వ్యభిచారం కొనసాగించాలని భర్త ఒత్తిడి తెస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.
Also read
- తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026