జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాశులు ఉంటాయి. ఇవి వ్యక్తి పేరును బ్టటి, వారికి రాశి కేటాయించబడి ఉంటుంది. ఈ రాశులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయి. అయితే పన్నెండు రాశుల్లో ఒక్కటైన ధనస్సు రాశి వారు కొన్ని విషయాల్లో తగ్గి ఉంటే, జీవితం అద్భుతంగా ఉంటుందంట.
జ్యోతిష్య శాస్త్రంలో ధనస్సు రాశి వారికి అధిపతి గురు గ్రహం. గురు గ్రహానికి రెండు రాశులు ఉన్నాయి అందులో ధనస్సు రాశి కూడా ఒకటి. ఈ రాశి వారు చాలా సాహసోపేతమైన వ్యక్తులు, వినూత్నంగా ఆలోచిస్తారు. అయినప్పటికీ వీరు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొకంటారు. అయితే వీరు కొన్ని విషయాల్లో తగ్గి ఉంటే, జీవితంలో గొప్పగా జీవిస్తారంట, కోటీశ్వరులు అవుతారంట. లేకపోతే అనేక రకాల సమస్యలతో సతమతం కాక తప్పదు అని చెబుతున్నారు పండితులు.
ముఖ్యంగా ధనస్సు రాశి వారు నేను, నా, అనే అహం, భావన నుంచి బయటపడాలి. అప్పుడే వీరు జీవితంలో గొప్పగా జీవిస్తారు, మంచి స్థాయిలో ఉంటారు. నేను నా, అనే భావన వీరిని ఇతరుల నుంచి దూరం చేయడమే కాకుండా, అనేక అవకాశాలు కూడా కోల్పోయేలా చేస్తుందంట. అందువలన ఇలాంటి దాని నుంచి బయటపడాలి, మొండితనం వదలెయ్యాలి. అప్పుడే చాలా గౌరవంగా జీవిస్తారు.
వీరు చాలా వరకు సాహసాలు చేయడంలో ముందు ఉంటారు. కానీ కొన్నిసార్లు అందరికంటే గొప్పగా కనిపించాలని చేసే సాహసాలు, జీవితలో ఎదురు దెబ్బలను తీసుకొస్తాయి. వాటి వలన మీరు మరలా పశ్చాత్తాపానికి గురి అవుతారు. అందువలన అటువంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే స్వేచ్ఛగా ఉండటం మంచిదే , అభిప్రాయాలను వ్యక్తపరిచడం మంచిదే కానీ, మీ అభిప్రాయాలను చెప్పే సమయంలో ఇతర మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం చేయకూడదంట. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also read
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026
- 24 ఏళ్లుగా కొడుకు జాడ కోసం ఎదురుచూపులు.. సాధువు వేషం వేసి నకిలీ కొడుకు నాటకం! చివర్లో సినీ ఫక్కీ ట్విస్ట్
- బల్లి పడిన నీరు తాగిన 12 మంది కార్మికులు.. కాసేపటికే వింత ప్రవర్తన.. హాస్పిటల్కు తీసుకెళ్లగా





